‘యాత్ర’ మారనుందా..!

November 7, 2018 at 11:05 am

దివంగ‌త నేత వైఎస్సార్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిస్తున్న `యాత్ర‌` బ‌యోపిక్ చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్తి అయింది. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మాత్ర‌మే జ‌రుగుతోంది. అయితే.. ఈ సినిమా విడుద‌ల తేదీపైనే చిత్ర‌యూనిట్ పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను డిసెంబ‌ర్ 21న విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కానీ.. ఈ డేట్ విష‌యంలో మ‌రోసారి ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. నిజానికి ఈ సినిమా మొద‌లైన‌ప్పుడు సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకున్నార‌ట‌.

yatra-movie-HD-stills-1

ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ 21న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ.. మ‌ళ్లీ ఇప్పుడు సంక్రాంతికి విడుద‌ల చేస్తేనే మంచిద‌నే ఆలోచ‌న‌కు చిత్ర‌యూనిట్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అయితే.. ఇందులో ఏ తేదీన సినిమా విడుద‌ల అయినా.. ఇంకా చాలా స‌మ‌యం ఉండ‌డంతో చిత్ర‌యూనిట్‌కు మాత్రం ఎలాంటి వ‌ర్క్ ప్రెజ‌ర్ అయితే లేద‌నే చెప్పాలి. అందుకే ఎలాంటి టెన్ష‌న్ లేకుండా కూల్‌గా ఉంది. కాక‌పోతే.. విడుద‌ల తేదీపైనే కొంత త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. వైఎస్సార్ తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిన నేత‌.

YSR-Biopic-Mammootty-Yatra-Movie-Stills-HD-2592fa1

ఆయ‌న జీవిత విశేషాల‌తో రూపొందిస్తున్న బ‌యోపిక్ ఏ స‌మ‌యంలో.. ఏ తేదీలో విడుద‌ల అయినా జ‌నాక‌ర్ష‌ణ మాత్రం త‌గ్గ‌దనే న‌మ్మ‌కంతో చిత్ర‌యూనిట్ ఉంది. సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా.. యాత్ర థియేట‌ర్ల‌లో జైత్ర‌యాత్ర చేయ‌డం ఖాయ‌మ‌నే ధీమాతో ఉంది. ఇక యాత్ర సినిమాలో వైఎస్సార్ పాత్ర‌లో మమ్ముట్టి, రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు న‌టించారు. యాత్ర సినిమాను 70ఎమ్ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ నిర్మిస్తున్నారు. విడుద‌ల తేదీలో త్వర‌లోనే మ‌రింత క్లారిటీ రానుంది.

‘యాత్ర’ మారనుందా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share