వైయస్సార్ ‘యాత్ర’ కు అర్జున్ రెడ్డి మైలేజీ!

September 14, 2018 at 12:47 pm
YSR Biopic, Yatra, YS jagan Character, Vijay devarakonda, Lead role, major assert

ఉమ్మ‌డి రాష్ట్రంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి త‌న పాద‌యాత్ర‌తో ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేసిన వైఎస్సార్ జీవితం ఆధారంగా `యాత్ర‌` సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. `యాత్ర‌` బ‌యోపిక్‌కు సంబంధించిన అనేక అంశాలు రోజురోజుకూ అటు రాజ‌కీయ‌వ‌ర్గాలు, ఇటు ప్రేక్ష‌కుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికే పోస్ట‌ర్లు- సాంగ్ టీజ‌ర్‌కు నీరాజ‌నం ల‌భిస్తోంది.

ఈ సినిమాకు మ‌హి. వీ రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా. మ‌ల‌యాళ హీరో మ‌మ్మ‌ట్టి వైఎస్సార్ పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అంద‌రి ద‌`ష్టి.. ఈ బ‌యోపిక్‌లో జ‌న‌గ్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తున్నార‌నే దానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ పాత్ర కోసం ఎవ‌రికి తీసుకుంటున్నార‌న్న విష‌యంలో ఇప్ప‌టికీ క్లారిటీ లేక‌పోవ‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

nota-vijay-deverakonda-671-1536482774

అయితే.. ఈ విష‌యంలో కొన్ని ఊహాగానాలు వినిపించాయి.. ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఇందులో ప్ర‌ధానంగా కోలీవుడ్‌కు చెందిన సూర్య – కార్తీ పేర్లు వినిపించాయి. కానీ జగన్ పాత్రధారి ఎవరో చిత్రయూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా.. మ‌రో పేరు వినిపిస్తోంది. ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. టాలీవుడ్‌కు చెందిన‌ యంగ్ త‌రంగ్ విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. వైసీపీ అధినేత జగన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. దేవరకొండ ఆ పాత్రలో నటిస్తే సినిమాకి బాగా క‌లిసి వ‌స్తుంద‌ని.. ముఖ్యంగా మార్కెట్ పెరుగుతుంద‌ని.. అందుకే ఆయ‌నకు భారీ ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అంతేగాకుండా.. జ‌గ‌న్ పాత్ర‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తే.. అటు సినిమాకు ప్ల‌స్ అవ‌డ‌మేకాకుండా.. ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లో విజ‌య్ పేరు మార్మోగుతుంద‌ని.. ఇలా రెండు ర‌కాలుగా లాభిస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని ప‌లువురు చెబుతున్నారు. అయితే.. ఈ విష‌యంలో మాత్రం చిత్ర‌యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌లు సినిమాల్లో బిజీగా ఉన్నారు. నోటా సినిమా శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ఇటీవ‌ల విడుద‌ల అయిన టీజ‌ర్‌కు మాంచి స్పంద‌న వ‌చ్చింది. ఆ త‌ర్వాత మ‌రో సినిమా డియ‌ర్ కామ్రెడ్‌కు కూడా ఆయ‌న ఒప్పుకున్నారు.

వైయస్సార్ ‘యాత్ర’ కు అర్జున్ రెడ్డి మైలేజీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share