ర‌వితేజ‌ను ప్రెజ‌ర్ పెడుతోన్న నాగార్జున‌..!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు ఇటీవ‌ల వ‌రుస ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఓ వైపు డ్ర‌గ్స్ ఇష్యూలో ఆయ‌న పేరు బ‌య‌ట‌కు రావ‌డం, త‌మ్ముడు భ‌ర‌త్ మృతిచెందాక అత‌డి అంత్య‌క్రియ‌ల‌కు సైతం ర‌వితేజ హాజ‌రు కాక‌పోవ‌డంతో ఆయ‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఎప్పుడో 2015 ద‌స‌రాకు వ‌చ్చిన బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత ర‌వితేజ న‌టించిన ఏ సినిమా థియేట‌ర్ల‌లోకి రాలేదు. ర‌వితేజ మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది.

ఇక ర‌వితేజ న‌టిస్తోన్న తాజా చిత్రం రాజా ది గ్రేట్ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అక్టోబ‌ర్ 12న డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ డేట్ మార్చుకోవాలంటూ ర‌వితేజ‌తో పాటు చిత్ర యూనిట్‌పై ఒత్తిళ్లు వ‌స్తోన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది.

నాగార్జున న‌టిస్తోన్న రాజు గారి గ‌ది-2 సినిమా నుంచి రాజా ది గ్రేట్‌కు త్రెడ్ ఉంది. రాజు గారి గ‌ది-2ను ముందుగా ఆగ‌స్టు 25న రిలీజ్ చేయాల‌నుకున్నా సినిమా లేట్ అవ్వ‌డంతో ఈ డేట్‌ను నాగ్ చైతు కొత్త సినిమాకు త్యాగం చేశాడు. ఇక సెప్టెంబ‌ర్‌లో పైసా వ‌సూల్‌, స్పైడ‌ర్‌, జై ల‌వ‌కుశ లాంటి పెద్ద సినిమాలు ఉండ‌డంతో నాగ్ త‌న సినిమాను అక్టోబ‌ర్ 12కు ఫిక్స్ చేసుకున్నాడ‌ట‌.

దీంతో ఇప్పుడు అదే రోజు డేట్ ఫిక్స్ చేసుకున్న రాజా ది గ్రేట్‌ను వాయిదా వేసుకోవాల‌ని ఒత్తిడి వ‌స్తోంద‌ట‌. గ‌తంలో అఖిల్ సినిమా కోసం కూడా నాగ్ ఒత్తిడితో ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి మ‌ళ్లీ నాగ్‌తోనే ర‌వితేజ త‌న సినిమాను వాయిదా వేసుకోక తప్పేలా లేద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.