నంద్యాల రూర‌ల్ కౌంటింగ్ ఇలా జ‌రిగింది…

తెలుగు రాజ‌కీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌లో అధికార టీడీపీ దూసుకుపోతోంది. వైసీపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నంద్యాల రూర‌ల్ మండ‌లంలో వైసీపీకి దిమ్మ‌తిరిగిపోయే షాక్ త‌గిలింది. వైసీపీకి పట్టున్న నంద్యాల రూరల్‌ మండలంలో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక్క‌డ మొత్తం ఐదు రౌండ్ల కౌంటింగ్ జ‌ర‌గ‌గా అన్ని రౌండ్ల‌లోను టీడీపీకి భారీ మెజార్టీ వ‌చ్చింది.\

నంద్యాల రూర‌ల్ మండ‌లం కౌంటింగ్ ముగిసేసరికి టీడీపీకి 31,062, వైసీపీకి 17,927, కాంగ్రెస్‌కు 278 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ వైసీపీకి పట్టున్న రూరల్ మండలంలో 13,135 ఓట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించింది. ఇక ఇక్క‌డ ఐదు రౌండ్ల వారీగా కౌంటింగ్ ఫ‌లితాలు ఇలా ఉన్నాయి.

1వ రౌండ్‌:

మొదటి రౌండ్‌‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5474 ఓట్లు పోలవగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4179 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి రౌండ్‌లో టీడీపీ 1295 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

2వ రౌండ్‌:

రెండో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4726 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3945 పోలయ్యాయి. దీంతో రెండో రౌండ్‌లో టీడీపీ 1634 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

3వ రౌండ్‌:

మూడో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 7058 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3126 పోలయ్యాయి. దీంతో మూడో రౌండ్‌లో టీడీపీ 3,113 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

4వ రౌండ్‌:

నాలుగో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 6465 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 2859 పోలయ్యాయి. దీంతో నాలుగో రౌండ్‌లో టీడీపీ 3600 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

5వ రౌండ్‌:

ఐదో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఆరు వేల పైచిలుకు ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మూడు వేల పైచిలుకు పోలయ్యాయి. దీంతో ఐదో రౌండ్‌లో టీడీపీ మూడు వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యం లభించింది.