టాలీవుడ్ లో మరో మల్టీ స్టారర్ సినిమా!

హ్యాట్రిక్ హిట్స్ ఎవరివి అని తెలుగు ఇండస్ట్రీలో అడిగేతే తడుముకోకుండా చెప్పే సమాధానం నాని. కెరీర్ పరంగా చూసుకుంటే నాని హిట్ శాతం 90% ఉంటుంది. ప్రస్తుతం నాని నటించిన ‘నిన్ను కోరి’ అనే కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది, ఈ సినిమా కూడా నాని హిట్ ఫార్ములా లో పడి పెద్ద హిట్ అయిన పెద్ద ఆశ్చర్య పడనవసరం లేదు. ఎందుకంటే నాని కథని యాక్టింగ్ ని నమ్ముకొని పైకి వచ్చాడు అనటం లో ఎటువంటి సందేహం లేదు. నాని కెరీర్‌లో మొట్టమొదటిసారి ఓ పెద్ద హీరోతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్నాడట.

గతంలోనూ కొన్ని మల్టీస్టారర్‌ సినిమాలు చేసిన నాని.. చిన్న చితక హీరోలతో తప్ప పెద్ద హీరోతో మాత్రం కలిసి నటించలేదు. తాజా సమాచారం ప్రకారం ‘కింగ్‌’ నాగార్జునతో కలిసి నాని ఓ సినిమాలో నటించనున్నాడట. గతంలో నాగ్‌, నిఖిల్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా  కోసం మాటలు జరిపారు అవి ఫలించక ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు నిఖిల్‌ స్థానంలోకి నాని వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. బహుశా త్వరలోనే ఈ మల్టీ స్టారర్ సినిమా మన ముందుకు రావచ్చు.