స్టార్ హీరోల‌కు షాక్ ఇస్తోన్న ” నిన్ను కోరి ” క‌లెక్ష‌న్లు

యంగ్‌ హీరో నాని త‌న అక్కౌంట్‌లో వ‌రుస‌గా ఏడో హిట్ వేసుకున్నాడు. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంతో స్టార్ట్ అయిన నాని విజ‌యాల ప‌రంప‌ర త‌న తాజా సినిమా నిన్ను కోరి వ‌ర‌కు కంటిన్యూ అవుతోంది. ఇక నాని క్రేజ్‌, రేంజ్ సినిమా సినిమాకు ఎలా పెరుగుతున్నాయో నిన్ను కోరి సినిమా స్ప‌ష్టం చేస్తోంది.

నిన్ను కోరి సినిమా ఫుల్ ఏ క్లాస్ మూవీ. అయినా ఈ సినిమాకు చాలా మంది స్టార్ హీరోల సినిమాల‌కే రాని విధంగా రెండు రోజుల్లో రూ. 20 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. నిన్ను కోరి మొదటి రోజున రూ.10.6 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. రెండో శనివారం రూ. 9.60 కోట్లు గ్రాస్‌ వసూళ్లు సొంతం చేసుకుంది. మొత్తం రెండు రోజుల్లో మొత్తం రూ. 20.20 కోట్లు గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

ఇక ఓవ‌ర్సీస్‌లో సైతం ఈ సినిమా వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ మార్క్‌కు చాలా ద‌గ్గ‌ర్లో ఉంది. నిన్ను కోరి మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.4.24 కోట్లు కలెక్షన్లు సాధించిందని త‌రుణ్ ఆద‌ర్శ్ ఆయన వెల్లడించారు. రూ. 18 కోట్ల పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో లాభాలు గడించడం విశేషం.

నాని క్లాస్ సినిమాతో సాధిస్తోన్న ఈ వ‌సూళ్ల దెబ్బ‌తో స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. బ‌న్నీ లేటెస్ట్ మూవీ డీజే ఓవ‌ర్సీస్‌లో 1 మిలియ‌న్ మార్క్ సాధించేందుకు నానా ఆప‌సోపాలు ప‌డింది. అక్క‌డ ఆ సినిమాకు భారీ న‌ష్టం వ‌చ్చింది. నాని సినిమా మూడు రోజుల‌కే మిలియ‌న్ మార్క్‌కు చేరుకోవ‌డంతో ట్రేడ్ వ‌ర్గాలు సైతం షాక్‌లో ఉన్నాయి.