‘ నేనే రాజు నేనే మంత్రి ‘ 3 డేస్ రిపోర్ట్‌

ద‌గ్గుపాటి రానా – తేజ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ నేనే రాజు నేనే మంత్రి. తేజ ప‌దేళ్ల త‌ర్వాత మంచి ట్రైల‌ర్ క‌ట్ చేయ‌డంతో ఈ సినిమాలో ఏదో కొత్త‌ద‌నం ఉంటుంద‌ని జ‌నాలు ముందు నుంచి ఊహించారు. తేజ త‌న జాన‌ర్‌ను దాటి కొత్త జాన‌ర్‌లో ఈ సినిమాను తీయ‌డంతో అంద‌రిలోను ఏదో ఆశ క‌లిగింది. ఇక బాహుబ‌లి సినిమాతో భ‌ళ్లాల‌దేవుడి క్యారెక్ట‌ర్ త‌ర్వాత రానాకు నేష‌న‌ల్ వైజ్‌గా క్రేజ్ వ‌చ్చింది. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్కిన ఈ సినిమా లై, జ‌య జాన‌కి నాయ‌క సినిమాల‌కు పోటీగానే ఈ నెల 11న థియ‌ట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

మూడు సినిమాల కాంపిటేష‌న్‌లో కూడా రాజు మంత్రి అత్య‌ధిక వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. తొలి రోజు రూ 3.75 కోట్ల థియేట్రిక‌ల్ షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ మూడు రోజుల‌కు ఏపీ + తెలంగాణ‌లో రూ. 9 కోట్లు, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 11.47 కోట్ల షేర్ సాధించింది. ఇక ఆగ‌స్టు 15 సెల‌వు రావ‌డంతో ఈ సినిమా ఐదు రోజుల‌కే లాభాల భాట‌లోకి వ‌చ్చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

‘ నేనే రాజు నేనే మంత్రి ‘ 3 డేస్ ఏరియా వైజ్ షేర్ :

నైజాం – 3.55 కోట్లు

సీడెడ్‌- 1.32

ఉత్త‌రాంధ్ర – 1.56

ఈస్ట్ – 0.69

వెస్ట్ – 0.39

గుంటూరు – 0.63

కృష్ణా – 0.58

నెల్లూరు – 0.328

——————————————–

ఏపీ+తెలంగాణ షేర్ = 9.00 కోట్లు

——————————————–

క‌ర్ణాట‌క – 0.85

రెస్టాఫ్ ఇండియా – 0.30

ఓవ‌ర్సీస్ – 1.32

——————————————————

టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ 3 డేస్ షేర్ = 11.47 కోట్లు

——————————————————