‘ నేనే రాజు నేనే మంత్రి ‘ ఫ‌స్ట్ షో టాక్‌… తేజ ఏం చేశాడో చూడండి

బాహుబ‌లి సినిమాలోని భ‌ళ్లాల‌దేవుడి క్యారెక్ట‌ర్‌తో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన ద‌గ్గుపాటి రానా తాజాగా నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన సినిమాలో న‌టించాడు. గ‌త ప‌దేళ్లుగా స‌రైన హిట్ లేని తే ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. పొలిటిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌డంతో తెలుగులో ఇలాంటి సినిమాలు వ‌చ్చి చాలా రోజులు కావ‌డంతో ఈ సినిమాపై మంచి హైప్ వ‌చ్చింది.

రానా గ‌తంలో లీడ‌ర్ సినిమాలో న‌టించ‌డం, ఇక తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్లు కొత్త‌గా ఉండ‌డంతో నేనే రాజు నేనే మంత్రిపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా ప్రీమియ‌ర్ షో టాక్ త‌ర్వాత అంచ‌నాలు అందుకోలేద‌న్న టాక్ తెచ్చుకుంది. ఇది రొటీన్‌గా తెలుగులో వ‌చ్చే సినిమాల‌కు భిన్నంగానే ఉంటుంది. సినిమాను ద‌ర్శ‌కుడు తేజ పూర్తిగా పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లోనే తెర‌కెక్కించాడు.

ఫ‌స్టాఫ్‌లో పొలిటిక‌ల్ సీన్ల‌తో పాటు రానా – కాజ‌ల్ మ‌ధ్య కెమిస్ట్రీతో సినిమాను న‌డిపాడు. రానా-కాజ‌ల్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్లు బాగున్నా మధ్య మధ్యలో కొన్ని బోరింగ్ సీన్లు ఉన్నాయి. ఇక సెకండాఫ్‌లో ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న ప్రేక్ష‌కుడికి అది కూడా సంతృప్తినిచ్చేలా లేదు.

సెకండాఫ్‌లో వ‌చ్చే కొన్ని సీన్లు మ‌న తెలుగు ప్రేక్ష‌కుడు కోరుకునేలా ఉండ‌వు. ఈ సినిమా యాంటీ క్లైమాక్స్ తెలుగు ఆడియన్స్ జీర్ణించుకుంటారా లేదా అనేది పెద్ద ప్రశ్న. మొత్తంగా అయితే ‘నేనే రాజు నేనే మంత్రి’ లో రెగ్యులర్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు లేవు.

ఈ రోజు మూడు సినిమాల మ‌ధ్య గ‌ట్టిపోటీతో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌వ‌ర‌కు ప్ర‌భావం చూపుతుంద‌నేది ? చూడాలి. ఓవ‌రాల్‌గా అయితే సినిమాకు ఆశించినంత టాక్ అయితే లేదు.