అక్కడ వైసీపీ ఓట్లు గల్లంతు !

October 18, 2018 at 3:37 pm
33333333333

గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట రాజ‌కీయాలు నీచంగా మారుతున్నాయా? ముఖ్యంగా ఇక్క‌డ అధికార పార్టీ త‌ర‌ఫున గ‌తం లో చ‌క్రం తిప్పిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడి కుమారుడు ఓటు రాజ‌కీయాల‌కు తెర‌దీశాడా? అంటే తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. న‌ర‌స‌రావుపేట గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా టీడీపీకి కంచుకోట‌. కానీ, ఆ పార్టీ సీనియ‌ర్ నేత, ఆయ‌న కుమారుడి రాజ‌కీయాల‌తో విసిగిపోయిన ఇక్క‌డి ప్ర‌జ‌లు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ప‌ట్ట‌గ‌ట్టారు. నిజానికి ఇది టీడీపీ కంచుకోటే అయినా ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని, టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు నుంచున్నా ఓట‌మి ఖాయ‌మ‌ని గుర్తించిన పార్టీ అధినేత చంద్ర‌బాబు.. అప్ప‌టి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి ప్ర‌జ‌లు మాత్రం బీజేపీని సైతం ఓడించారు.

వైసీపీ నాయ‌కుడు డాక్ట‌ర్ గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డికి ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్ట‌క‌ట్టారు. దీంతో ఆయ‌న ఇక్క‌డ ప్ర‌జ‌ల‌లో దూసుకు పో తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు ఇక్క‌డి టికెట్ క‌న్ఫ‌ర్మ్ అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు మ‌రో సారి ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టంక‌ట్టేందుకు రెడీ అయిన నేప‌థ్యంలో టీడీపీ సీనియ‌ర్ నేత కుమారుడు ఒక‌రు ఇక్కడ వ్యూహా త్మ‌కంగా వైసీపీకి చెక్ పెట్టే కార్య‌క్ర‌మానికి పూనుకున్నారు. ఇదే ఇప్పుడు ఇక్క‌డ టీడీపీకి పెద్ద విఘాతంగా మారి పోయింది. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 4 వేలు ఓట్లు తొలగించడానికి సిద్ధమయ్యారనే వార్త‌లు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ అనుకూలుమైన నాలుగు నుంచి ఐదు వేల ఓట్లు తొలగించడానికి టీడీపీ కుట్ర చేస్తోందని ఇటీవ‌ల కాలంలో వైసీపీ నేత‌లు అంటున్నారు.

ఇందుకోసం నగర దీపికలు అనే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను టీడీపీ వినియోగించుకుంటోందనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బతికి ఉన్నవాళ్లను చనిపోయినట్లు, ఊళ్లలో ఉన్నవారిని వలస పోయినట్లు చూపించి ఓట్లు తొలగిస్తున్నారనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే న‌ర‌స‌రావుపేటలో వైసీపీకి అనుకూలంగా ఉన్న దాదాపు 4 వేల మంది ఓట్ల‌ను తొల‌గించేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. కొంతమంది అధికారులు టీడీపీ నాయకులకు ఒత్తాసు పలికి వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగిస్తున్నారనే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరులోనే ఈ ప‌రిస్థితి ఎదురైతే.. మిగిలిన జిల్లాల ప‌రిస్థితి ఏంట‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఏదేమైనా.. ఆ సీనియ‌ర్ నాయ‌కుడి కుమారుడి ఆగ‌డాల‌కు బ్రేక్ వేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అక్కడ వైసీపీ ఓట్లు గల్లంతు !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share