అసెంబ్లీ వైపు నంద‌మూరి హీరో చూపులు

December 2, 2016 at 5:24 am
chandrababu

పాలిటిక్స్ అంటే ఎవ‌రికి చేదు! అంటూంటారు అనుభ‌వ‌జ్ఞులు. అధికారానికి అధికారం, ప్ర‌జ‌ల్లో పాపులారిటీ.. ఇంత‌క‌న్నా కావాల్సింది ఏముంటుంది. అందుకే పాలిటిక్స్‌లో చేరేందుకు దాదాపు అంద‌రూ ఆస‌క్తి చూపుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ వ‌రుస‌లో నంద‌మూరి హీరో తార‌క ర‌త్న చేరిపోయాడు! ఈయ‌నెవ‌రా అని ఆలోచిస్తున్నారా.. ? 2002లో ఒక‌టో నెంబ‌రు కుర్రోడు తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. పెద్దగా అభిమానుల‌ను సంపాయించు కోలేక‌పోయిన మోహనకృష్ణ కొడుకు! ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు.

ఇప్పుడు ఈయ‌నే పాలిటిక్స్‌లోకి వ‌చ్చేయాల‌ని భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం కూడా చేశాడు. అయితే, వ‌చ్చే 2019లో పొలిటిక‌ల్ గా కూడా త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకుందామ‌ని ఆయ‌న ఎంతో ట్రై చేస్తున్నాడు. మేన‌మామ చంద్ర‌బాబు అధ్య‌క్షుడిగా ఉన్న టీడీపీలోనే ఎద‌గాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. అంతేకాకుండా 2019 ఎన్నిక‌ల్లో గుంటూరు నుంచి పోటీ చేసి అసెంబ్లీలోనూ అడుగు పెట్టాల‌ని క‌ల‌లు కంటున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

వాస్త‌వానికి.. కుటుంబ స‌భ్యులు ఎవ‌రినీ ఒక్క బాల‌య్య‌ని మిన‌హా చంద్ర‌బాబు పెద్ద‌గా పాలిటిక్స్‌లో ఎద‌గ‌నిచ్చింది లేదు. సొంత త‌మ్ముడు రామ్మూర్తినాయుడుని కూడా బాబు ఎద‌గ‌నీయ‌లేద‌నే విమ‌ర్శ ఉంది. ఇక‌, హ‌రికృష్ణ, జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ల ప‌రిస్థితి వేరే చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం ఎలాంటి ప్రాధాన్యం లేని ర‌వాణా శాఖ‌ను హ‌రికృష్ణ‌కు ఇచ్చారు చంద్ర‌బాబు. దీంతో ఆయ‌న అలిగి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌లిశార‌నుకోండి.

ఇక‌, ఈ క్ర‌మంలో ఇప్పుడు తార‌క ర‌త్న టీడీపీలో ఎదిగేందుకు, ఎమ్మెల్యే సీటు పొందేందుకు క‌ల‌లు క‌న‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. మ‌రి దీనిపై చంద్రాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒక‌ప‌క్క త‌న కుమారుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ఫ్యూచ‌ర్‌ను దృష్టి లో పెట్టుకుంటే .. నంద‌మూరి ఫ్యామిలీకి బాబు ప్రాధాన్యం ఇస్తారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఈ క్ర‌మంలో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి ఇప్ప‌టికైతే.. తార‌క ర‌త్న‌.. పొలిటిక‌ల్ ఎంట్రీపై మాత్రం పొగ వ‌స్తోంది!!

 

అసెంబ్లీ వైపు నంద‌మూరి హీరో చూపులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share