ఆప‌రేష‌న్ వైకాపా స్టార్ట్ చేసిన బాబు

January 26, 2017 at 8:44 am
CBN

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ వైకాపా స్టార్ట్ చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం యువ‌త‌తో పాటు వైకాపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర విపక్ష పార్టీలన్ని సంయుక్తంగా చేప‌ట్టిన ప్ర‌త్యేక నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర‌స‌న‌ను అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ వైకాపా నేత‌ల‌ను అరెస్టు చేస్తూ ఆప‌రేష‌న్ వైకాపా స్టార్ట్ చేసింది.

ఈ నిర‌స‌న స‌క్సెస్ అయితే ఆ క్రెడిట్ ఎక్కువుగా వైకాపా ఖాతాలో ప‌డే ఛాన్స్ ఉంద‌ని..ఇది త‌మ‌కు మైన‌స్ అవుతుంద‌ని భావించిన బాబు స‌ర్కార్ చాలా వ్యూహాత్మ‌కంగా ఈ ఆప‌రేష‌న్ వైకాపాకు తెర‌లేపిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీనిని అడ్డుకునే లక్ష్యంగా పోలీసులు ముందస్తు అరెస్టులు ప్రారంభించారు. గత అర్ధరాత్రి నుంచి విశాఖ వైకాపా నేతల ఇళ్లముందు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

గ‌త‌రాత్రే వైకాపా నేత విజ‌య్‌చంద‌ర్‌ను అరెస్టు చేసి త్రీ టౌన్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఇక కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌లో తానే స్వ‌యంగా పాల్గొంటాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో బీచ్ ఏరియాకు వైకాపా నాయ‌కులను ఎవ్వ‌రిని వెళ్ల‌నీయ‌డం లేదు.

ఇక ఇదే అంశంపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు స్పందిస్తూ వైకాపా అధినేత జ‌గ‌న్‌తో పాటు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు స‌వాల్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పత్యేక ప్యాకేజీతో కలిగే లాభాలపై వీరిద్ద‌రూ చ‌ర్చ‌కు రావాల‌ని ఆయ‌న స‌వాల్ చేశారు. విశాఖలో రెండు రోజుల పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని… ఈ స‌ద‌స్సుకు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు కూడా హాజరవుతున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇక 50 దేశాల నుంచి 2వేల మందికి పైగా ప్ర‌తినిధులు ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌వుతుంటే…. దీనిని అభాసుపాలు చేసేందుకే ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఏదేమైనా నిర‌స‌న హోదాపై ఇప్పుడు అంద‌రిలోను టెన్ష‌న్ నెల‌కొంది.

 

ఆప‌రేష‌న్ వైకాపా స్టార్ట్ చేసిన బాబు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share