కేఏ పాల్.. లోకేష్ కి ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా?

February 28, 2017 at 10:14 am
132

కేఏ పాల్.. దాదాపుగా ఇప్పుడు ఎవ్వ‌రికీ గుర్తులేని పేరు! ప్ర‌పంచం మొత్తం తిరిగాన‌ని, జార్జ్ బుష్ నుంచి ఒబామా వ‌ర‌కు అంద‌రినీ తానే గెలిపించాన‌ని, త‌న స‌ల‌హా తీసుకునే వాళ్లు నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ఇలా.. గొప్ప‌లు చెప్పుకున్న పాల్‌.. త‌ర్వాత కాలంలో ప్ర‌జా శాంతి పార్టీ పేరుతో రాజ‌కీయాల్లో కూడా వేలు పెట్టి కాలు మొత్తం కాల్చుకున్నాడు. ఆ త‌ర్వాత కుటుంబ హ‌త్యా కేసుల కార‌ణంగా జైలుకు కూడా వెళ్లాడు. ఇప్పుడు గుర్తొచ్చాడా? అయితే, దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ ట్విట్ట‌ర్ రూపంలో వెలుగు లోకి వ‌చ్చి మ‌ళ్లీ డ‌బ్బా మొద‌లెట్టేశాడు. ఈ సారి ఎంత డ‌బ్బా అంటే.. వినేవాళ్ల‌కి చెవుల్లోంచి ర‌క్తం కారాల్సిందే!

నానా తిప్ప‌లు ప‌డి, హిల్ల‌రీని నానా మాట‌లు తిట్టి.. చ‌చ్చీ చెడీ అమెరికా పీఠం ద‌క్కించుకున్నాడు డొనాల్డ్ ట్రంప్‌. ఇది మ‌నంద‌రికే కాదు, ప్ర‌పంచం మొత్తానికి తెలిసిన విష‌యం. కానీ.. ఇప్పుడు తాజాగా మ‌న పాల్ గారేమ‌న్నారంటే.. తానే స్వ‌యంగా ట్రంప్‌ను ద‌గ్గ‌రుండి గెలిపించాన‌ని, తాను చేసిన ప్ర‌చారం మాత్ర‌మే ఆయ‌న‌కు ఓట్లు ప‌డేలా చేసింద‌ని సొంత డ‌బ్బా బాగానే వాయించేసుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం ఓ ట్వీట్ చేశాడు. తానే ట్రంప్‌ని గెలిపించాన‌ని చెప్పుకొచ్చాడు. ఈ మాట ఆయ‌న‌కెలా అనిపిస్తోందో కానీ, వినేవాళ్ల‌కి మాత్రం.. ఛీ.. థూ.. అని మాత్రం అన‌కుండా ఉండ‌లేక పోతున్నార‌ట‌! రీట్వీట్స్ అధిరిపోతున్నాయి!

ఇక‌, ఇప్పుడు తాజాగా మ‌రో అంశాన్ని భుజానేసుకున్నాడు మ‌న పాల్‌గారు. అదే.. నారా లోకేష్‌ని ఎమ్మెల్యేని చేయ‌డం. అంతేకాదు, టీడీపీ పొలిట్ బ్యూరో ఏదో ముచ్చ‌ట‌ప‌డి ఇచ్చిన ఎమ్మెల్సీని ఈక మాద‌రిగా తీసి ప‌క్క‌న ప‌డేయ‌మ‌ని లోకేష్‌కి ఓ స‌ల‌హా కూడా ప‌డేశాడు పాల్‌. అంతేనా.. ఆయ‌న చేసిన ట్వీట్ చూస్తే.. అధిరిపోవాల్సిందే. ఎమ్మెల్సీ నీ స్థాయికి త‌గ‌దు.. ఎమ్మెల్యేగానే రావాలి. నిన్ను నేను గెలిపించుకుంటాను. నీ ప‌క్షాన ప్ర‌చారం చేసే బాధ్య‌త నాది. అక్క‌డ అమెరికాలో ట్రంప్‌ని గెలిపించిన‌ట్టే.. ఇక్క‌డ నిన్ను అసెంబ్లీకి పంపిస్తానంటూ రెచ్చిపోయాడు పాల్‌!! ఇదే.. క‌దా డ‌బ్బా అంటే!! ప్ర‌పంచానికి పాఠాలు చెబుతున్నానంటున్న పాల్ ఆ పాఠాలు తానెప్పుడు నేర్చుకుంటాడో!! పాల్ ఇక‌నైనా వాస్త‌వంలోకి రా.. ప్లీజ్‌.. ! ట్వీట్ల హోరు పెరిగిపోతోంది!

కేఏ పాల్.. లోకేష్ కి ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share