కేటీఆర్‌పై బావ అనంత‌ప్రేమ‌

January 27, 2017 at 7:12 am
ktr

తెలంగాణ మంత్రివ‌ర్గంలో బావ‌-బావమ‌రుదులెవ‌రో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. వారిలో ఒక‌రు సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అయితే మ‌రో వ్య‌క్తి భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్‌రావు. టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ త‌ర్వాత వార‌స‌త్వం కోసం వీరిద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు జ‌రుగుతుంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

వారిద్ద‌రు అటు పార్టీలోను, ఇటు ప్ర‌భుత్వంలోను ప‌ట్టుకోసం ఎత్తులు వేస్తున్నార‌న్న వార్త‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వారు క్లారిటీ ఇస్తున్నా ఈ పుకార్లు మాత్రం షికార్లు చేస్తూనే ఉంటున్నాయి. అయితే తాజాగా మంత్రి హ‌రీష్ బావ‌మ‌రిది కేటీఆర్ శాఖ‌కు సంబంధించిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రై బావ‌మ‌రిదిపై అనంత ప్రేమ చూపిస్తూ ఆకాశానికి ఎత్తేశారు.

తెలంగాణ ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రస్తుతం జ‌పాన్ ప‌ర్యట‌నలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ప్రఖ్యాత ఐటీ కంపెనీ సేల్స్ ఫోర్స్ కార్యాల‌యం ప్రారంభోత్సవం జ‌రిగింది. ఈ కార్యక్ర‌మానికి కేటీఆర్ హాజ‌రు కావాల్సి ఉన్నా…ఆయ‌న విదేశాల్లో ఉండ‌డంతో  హ‌రీష్  హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ మాట్లాడుతూ బావ‌మ‌రిది కేటీఆర్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.

తెలంగాణ‌లో ఐటీ అభివృద్ధికి కేటీఆర్ ప‌నితీరే నిద‌ర్శన‌మంటూ ప్ర‌శంసించారు. కేటీఆర్‌పై హ‌రీష్ పొగ‌డ్త‌లు టీఆర్ఎస్ వ‌ర్గాల్లో సంతోషం నింపాయి. వాస్త‌వానికి హ‌రీష్‌రావు పొగ‌డ్త‌ల్లో నిజం కూడా ఉంది. ఐటీ మంత్రిగా కేటీఆర్ ప్రపంచంలోని బ‌డా బ‌డా కంపెనీలు హైద‌రాబాద్ కు వ‌చ్చేలా చొర‌వ చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే హ‌రీష్ సైతం కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

 

కేటీఆర్‌పై బావ అనంత‌ప్రేమ‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share