ఖైదీ నెంబర్ 150 వెనక వైఎస్.జగన్

January 23, 2017 at 6:15 am
1353

ఖైదీ నెంబ‌ర్ 150 చిరు 150 వ మూవీ సూప‌ర్ హిట్‌! ప‌దేళ్ల త‌ర్వాతైనా.. చిరు కూడా న‌ట‌న‌లో ఎంత మాత్ర‌మూ త‌గ్గ‌లేదు.. ఇది సూప‌ర్ డూప‌ర్ హిట్‌!! ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ హిట్ మ‌జాలోనే ఓ పొలిటిక‌ల్ సీన్ కూడా తెర‌మీద‌కి వ‌స్తోంద‌ని టాక్‌! మూవీ హిట్ అయిన నేప‌థ్యంలో చిరును అన్ని వ‌ర్గాల వారూ అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌ళాబంధు, కాంగ్రెస్ నేత సుబ్బ‌రామిరెడ్డి చిరును ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా చిరును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

అదేవిధంగా ప‌రిశ్ర‌మ‌లోని ప‌లువురు కూడా చిరును భారీ ఎత్తున స‌న్మానిస్తున్నారు. ఇదిలావుంటే, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కూడా చిరును స‌న్మానించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇది ఒక‌ర‌కంగా మూవీ మేనియాగానే భావించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తే.. పొలిటిక‌ల్ క‌ల‌రింగ్ ఏదో దీనికి ఆపాదించిన‌ట్టు తెలుస్తోంది. అంటే.. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వర్ స్టార్‌.. ప‌వ‌న్ ని చంద్ర‌బాబు దగ్గ‌ర చేశారు. నిజానికి ఏపీలో అధికారంలోకి రావాలంటే.. కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు కీలకం. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌ని బాబు ద‌గ్గ‌ర చేస్తున్నార‌ని తెలిసిన‌. బాబు వ్య‌తిరేక వ‌ర్గం చిరును ద‌గ్గ‌ర చేస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు!

ముఖ్యంగా 2019లో బాబుకు చెక్ పెట్టాలంటే.. కాపు సామాజిక వ‌ర్గాన్ని చేర‌దీయాల‌ని వైకాపా అధినేత జ‌గ‌న్ భావిస్తున్నారు. అయితే, దీనికి స‌రైన నేత ఆయ‌నకు క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలో దాస‌రి వైకాపాలోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇదిలావుంటే, ఇప్పుడు అదే దాస‌రితో చిరుకు గాలం వేస్తున్నార‌ని జ‌గ‌న్‌పై వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరుకు భారీ ఎత్తున స‌న్మానాలు, స‌త్కారాలు జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. దాస‌రి కూడా ఓ ప్రోగ్రాం పెట్టారంటే దాని వెన‌క కూడా జ‌గ‌న్ ఉన్నార‌ని అంటున్నారు. ఇదే నిజ‌మైతే.. ప‌వ‌న్‌కి పోటీగా అన్న‌య్య మార‌డం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏంజ రుగుతుందో చూడాలి.

ఖైదీ నెంబర్ 150 వెనక వైఎస్.జగన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share