టీఆర్ఎస్ ఎంపీగా గుత్తా జ్వాల..! రెండు నియోజకవర్గాలపై కన్ను..!

February 20, 2017 at 8:11 am
110

బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణిగా ఆమె ఎంత ఫేమ‌స్సో.. ఆట‌లో రాజ‌కీయాల్లోనూ ఆమె అంతే ఫేమ‌స్సు!! నిత్యం వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తూ.. త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది గుత్తాజ్వాల‌! ప్ర‌స్తుతం ఆమె ఆట‌కు గుడ్‌బై చెప్పాల‌నే యోచ‌న‌లో ఉంద‌ట‌. అయితే ఏంటి అంటారా! ఆట‌కు ఫుల్‌స్టాప్ పెట్టి.. రాజ‌కీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాని భావిస్తోంద‌ట‌.  అంతేగాక తెలంగాణ‌లో టీఆర్ఎస్ త‌ర‌ఫున ఎంపీగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఈ మేర‌కు సంబంధింత నాయ‌కుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. అంతేగాక ఎక్క‌డి నుంచి పోటీ చేయాలో కూడా ఆమె డిసైడ్ అయ్యార‌ట‌!

తొలి ఇన్నింగ్స్‌లో ఆట‌ల్లో ఇర‌గ్గొట్టిన క్రీడాకారులు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో రాజ‌కీయాల్లో చేరిపోతున్నారు. ప్ర‌స్తుతం గుత్తాజ్వాల కూడా ఇదే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. కెరీర్ తొలినాళ్ల‌లో ఆట‌లో రాకెట్‌లా దూసుకుపోయిన ఆమె.. త‌ర్వాత వివాదాల‌కు కేంద్రంగా మారింది. కోచ్ గోపీచంద్‌తో విభేదాలతో నిత్యం వార్త‌ల్లో వ్య‌క్తిలా మారిపోయింది. అంతేగాక‌ కొంత‌కాలంగా బ్యాడ్మింట‌న్ పోటీల్లో రాణించ‌లేక‌పోతోంది. అటు ఆట‌లో విబేదాలు, ఇటు ఫామ్ కోల్పోవ‌డం వంటి అంశాల‌తో ఆమె.. విసిగిపోయింద‌ట‌. దీంతో ఇక ఆట‌కు గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ట‌.

దీంతో ఏ రంగాన్ని ఎంచుకోవాలో  ప‌లువురు నేత‌ల‌ను సంప్ర‌దించ‌గా.. రాజ‌కీయాలైతే బెట‌ర్ అని సూచించార‌ట‌. ఆట, అందం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. దీంతో రాజ‌కీయాల్లో పోటీ చేస్తే.. స‌క్సెస్ అవ్వ‌వ‌చ్చ‌ని సూచించార‌ట‌. అయితే ఏ పార్టీలో చేరాలో కూడా ఇప్ప‌టికే డిసైడ్ అయిపోయార‌ట‌. తెలంగాణ‌లో తిరుగులేని టీఆర్ఎస్‌లో చేరితే.. ఇక త‌న‌కు తిరుగుండ‌ద‌ని గుత్తాజ్వాల భావిస్తున్నార‌ట‌.

అన్నీ కుదిరితే ఆమె ఎంపీగా పోటీచేసే అవ‌కాశ‌ముంద‌ని టాక్. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గం వెతుక్కునే ప‌నిలో ఉంద‌ట‌ జ్వాల‌. సికింద్రాబాద్ అయితే బెట‌ర్ అని కొంద‌రు టీఆర్ఎస్ నేత‌లు సూచించార‌ట‌. ఆమె మాత్రం మ‌ల్కాజ్ గిరిపై ఆస‌క్తిగా ఉంద‌ట‌. అయితే ఆమె సన్నిహితులు కూడా సికింద్రాబాద్ మంచి ఆప్ష‌న్ అని స‌ల‌హా ఇచ్చార‌ట‌. చూడాలి మ‌రి… 2019 ఎన్నిక‌ల్లో జ్వాల గులాబీ కండువా వేసుకొని పోటీ చేస్తుందో లేదో వేచిచూద్దాం!!

టీఆర్ఎస్ ఎంపీగా గుత్తా జ్వాల..! రెండు నియోజకవర్గాలపై కన్ను..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share