టీడీపీకి షాక్ ఇస్తోన్న జ‌గ‌న్ కొత్త ఆప‌రేష‌న్‌

December 16, 2016 at 6:43 am
Jagan

ఏపీలో పొలిటిక‌ల్‌గా ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఎక్కడాలేని విధంగా ప్రతిపక్ష పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీలోకి వ‌ల‌స‌లు కంటిన్యూగా జ‌ర‌గ‌గా, ఇప్పుడు వైకాపా రిక‌వ‌రీ పేరుతో ఇతర‌ పార్టీల‌తో పాటు అధికార పార్టీకి చెందిన వారిని సైతం త‌మ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లాపై జ‌గ‌న్ చేప‌ట్టిన కొత్త ఆప‌రేష‌న్ అధికార టీడీపీకి పెద్ద షాక్ ఇస్తోంద‌న్న టాక్ ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది.

జ‌గ‌న్ టీడీపీకి పట్టున్న ఏపీ రాజ‌ధాని కేంద్రం కృష్ణా జిల్లాతో పాటు కీల‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌రంపై గ‌ట్టిగా దృష్టి సారించ‌డంతో పాటు అక్క‌డ పెద్ద ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసి చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయిన‌ట్టే క‌నిపిస్తోంద‌. ఇప్ప‌టికే విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు వైకాపాలో చేరిపోగా, తూర్పు మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి సైతం వైకాపాలో చేరేందుకు చ‌ర్చ‌లు పూర్తియిన‌ట్టు టాక్‌.

ఇక సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు సైతం వైకాపాలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నార‌ని, ఈ మేర‌కు విష్ణు సైతం జ‌గ‌న్‌తో భేర‌సారాలు మాట్లాడుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో షాకింగ్ న్యూస్ ఏంటంటే టీడీపీలో అసంతృప్తితో ఉంటోన్న గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైకాపాలోకి జంప్ చేసి, ఆ పార్టీ త‌ర‌పునే ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువు అయిన దేవినేని నెహ్రూను టీడీపీలో చేర్చుకోవ‌డం వంశీకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ క్ర‌మంలోనే వంశీ త‌న వీలును బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది.

ఇక ఇదేకోవలో ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత‌ పొట్లూరి వ‌రప్ర‌సాద్ ‌(పీవీపీ) వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైకాపా త‌ర‌పున ఎంపీగా బ‌రిలోకి దిగుతార‌ని..అందుకు ఆయ‌న ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు చేసుకుంటున్నార‌న్న టాక్ బెజ‌వాడ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. జ‌గ‌న్ సైతం పీవీపీకి బెజవాడ పార్టమెంట్ పగ్గాలు అప్పగించేలా పార్టీ అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఏదేమైనా కీల‌క‌మైన విజ‌య‌వాడ‌పై జ‌గ‌న్ స్టార్ట్ చేసిన ఆప‌రేష‌న్ చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యింద‌నే టాక్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ట్రెండ్ అవుతోంది.

 

టీడీపీకి షాక్ ఇస్తోన్న జ‌గ‌న్ కొత్త ఆప‌రేష‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share