డాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చంద్రబాబు

January 24, 2017 at 11:43 am
153

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ప‌వ‌ర్ టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు! స‌మాజానికి ద్రోహులుగా భావిస్తున్న ఒక‌రిద్ద‌రి విష‌యంలో ఆయ‌న ఎంత‌గా సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంటున్నారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. చేతిలో అధికారం ఉన్నా.. అలాంటి వాళ్ల‌ని ఏమీ చేయ‌లేక‌పోతున్నారు! అని అనేవాళ్ల‌కి కౌంట‌ర్‌గా బాబు ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. తెర‌వెనుక సాగిన ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు బ‌య‌ట‌కు లీకైంది. త‌న బాధ్య‌త‌ల విష‌యంలో బాబు ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారో చెప్ప‌క‌నే చెప్పింది. విష‌యంలోకి వెళ్తే..

రాష్ట్ర పోలీసుల‌కు కంటిపై కునుకులేకుండా చేసిన‌ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ విష‌యంలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఉక్కుపాదం మోపారు. దేశంలో ఎక్క‌డా ఎర్ర‌చంద‌నం లేక‌పోవ‌డం, కేవ‌లం ఏపీలోనే ఉండ‌డం, రాష్ట్రానికి అది ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్న నేప‌థ్యంలో బాబు ఈ స్మ‌గ్లింగ్‌పై క‌న్నెర్ర‌చేశారు. ఈ క్ర‌మంలో స్మ‌గ్లింగ్ ముఠా నాయ‌కుడు కొల్లం గంగిరెడ్డికి ఉచ్చు బిగించారు. కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టి మారిష‌స్ ఉడాయించిన కొల్లం కోసం అధికారుల‌ను ప్ర‌త్యేకంగా అక్క‌డికి పంపి మ‌రీ రాష్ట్రానికి ర‌ప్పించారు. గ‌తంలో చంద్ర‌బాబుపై మావో దాడి ఘ‌ట‌న‌లో కొల్లం పేరు వినిపించ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం జైల్లో ఉన్న గంగిరెడ్డి శిక్షాకాలం బుధ‌వారంతో తీరిపోనుంది. అయితే, గంగిరెడ్డి బ‌య‌ట‌కు వ‌స్తే అన్ని విధాలా ప్ర‌మాద‌మ‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు త‌న ప‌వ‌ర్‌తో పాత కేసులు తోడించార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అతడిపై కడప పోలీసులు తాజాగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయిన గంగిరెడ్డి బెయిల్ పై వచ్చి మారిషస్ పారిపోయిన కేసు కూడా తెరపైకి తెచ్చారు. తాజా కేసుతో గంగిరెడ్డి విడుదల ఉండదని చెబుతున్నారు. కేసులో శిక్షాకాలం పూర్తయినా అది కాగితాల వరకే పరిమితమంటున్నారు. సో.. ఇలా చంద్ర‌బాబు త‌న ప‌వ‌రేంటో చూపించి డాన్‌కి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చార‌న్న‌మాట‌.

డాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చంద్రబాబు
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share