ధ్రువ TJ రివ్యూ

December 9, 2016 at 10:52 am
dhruva-tj-review

సినిమా : ధృవ
రేటింగ్ : 3.5 /5
పంచ్ లైన్ : ధ్రువ దూసుకెళ్లడం ఖాయం

నటీనటులు : రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి
సినిమాటోగ్రాఫర్ : పి.యస్.వినోద్
మ్యూజిక్ : హిప్ హాప్ తమిజ
ఎడిటర్ : నవీన్ నూలి
ప్రొడ్యూసర్స్ : అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్
దర్శకుడు : సురేందర్ రెడ్డి.

రీమేక్ సినిమా అనగానే ఒరిజినల్ తో పోల్చి చూడడం కామన్..అయితే ఒరిజినల్ కంటే రీమేక్ బాగా వుంది అన్న సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.ఈ ధ్రువ కూడా అలాంటిదే.ఒరిజినల్ తో పోల్చకుండా చూస్తే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి స్టైలిష్ గా గ్రిప్పింగ్ గా తీసిన మెగా ఫీస్ట్ అని చెప్పొచ్చు . అల్లు అరవింగ్ ప్రొడ్యూస్ చేస్తే సినిమాలు హిట్ అవుతాయో లేకపోతే ఆయన హిట్ సినిమా స్క్రిప్ట్స్ ని ఎంచుకుని మరీ తీస్తారో తెలీదు కానీ సరైన టైం లో రామ్ చరణ్ కి గీత్ ఆర్ట్స్ పర్ఫెక్ట్ బ్రేక్ ని ఇచ్చింది అని చెప్పొచ్చు.

ఇది హీరో విల్లన్ మధ్య జరిగే మూవీ అనుకోలేం.. ఇద్దరు హీరోలు ఉండగా ఒకరి గోల్ క్రైమ్ ని అంతం చేయడం అయితే ఇంకొకరిది క్రైమ్ ని పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్ చేస్తూ కాష్ చేసుకోవడం.ఇద్దరూ ఎవరెవరి గోల్స్ లో వాళ్ళు హీరోలే.హీరో విల్లన్ మధ్య ఒక్క ఫైట్ కూడా ఉండదు కానీ ఇద్దరి మధ్య మైండ్ వార్ పీక్స్ అని చెప్పొచ్చు.ఒకడు న్యూస్ క్రియేట్ చేసి సెన్సేషన్ అవ్వాలనుకుంటే ఆ న్యూస్ వెనుక దాగున్న నిజాన్ని తెలుసుకోవడానికి ఇంకోడు ట్రై చేస్తుంటాడు.సింపుల్ గా ఇదే ఈ ధ్రువ స్టోరీ.

ఇంకా ఐ పి ఎస్ ట్రైనింగ్ పూర్తవకుండానే ఎంతో క్రైమ్ రీసెర్చ్ చేసి తనకంటూ ఓ గోల్ ని తన శత్రువుని కూడా సెలెక్ట్ చేసుకుని డ్యూటీ లో జాయిన్ అయిన హీరో ఆ గోల్ ని ఆ శత్రువుని ఎలా అంతం చేసాడన్నది కతాంశం.సాధారణంగా ఇలాంటి రీమేక్ కథల్ని ఎవరైనా తీసేయొచ్చు కానీ సురేందర్ రెడ్డి ఛాయస్ పర్ఫెక్ట్ అని చెప్పాలి .ఎందుకంటే సురేందర్ రెడ్డి అనగానే ఆ స్టైలిష్ టేకింగ్ మనకి గుర్తొస్తుంది.తన మార్క్ స్టైల్ అఫ్ మేకింగ్ తో సినిమా ఫీల్ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా పెర్ఫెక్టుగా హేండిల్ చేసాడు సురేందర్ రెడ్డి ధ్రువ సినిమాని.

రామ్ చరణ్ ఐ పి ఎస్ ట్రైనీ గా, ఆఫీసర్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు.రామ్ చరణ్ బాడీ మేక్ ఓవర్ సాంగ్ హై లైట్.రాంచరణ్ కొత్తగా బాడీ ని బిల్డ్ చెయ్యలేదు కానీ ఉన్న బాడీ ని షేప్ చేసిన విధానం అతని కమిట్మెంట్ ని చూపిస్తుంది.ఈ సినిమా కి ఇంకో హీరో అరవింద్ స్వామి నే.తమిళ్ వెర్షన్ విల్లన్ అయినా అరవింద్ స్వామిని వేరే వాళ్ళతో ఎందుకు రీప్లేస్ చెయ్యలేదో అతని బిహేవియర్ చూస్తే తెలుస్తుంది.పెద్ద ప్లస్ ఏంటంటే ఎవరూ ఎవర్ని డామినెటే చేసినట్టు అనిపించక పోవడం ప్రేక్షకులు సినిమాతో ట్రావెల్ చేసేలా చేయడం ఈ స్క్రీన్ ప్లే కున్న స్ట్రెంగ్త్.రకుల్ ప్రీత్ అక్కడక్కడా అందాలు ఆరబోసే ప్రయత్నం చేసినా పాపం పెద్ద ప్రధాన్యం వున్నా పాత్ర కాదు పాప ది.మిగిలిన వాళ్లలో నవదీప్,నాజర్,పోసాని ఎవరి పాత్ర మేర వాళ్ళు న్యాయం చేశారు.

సినిమా మొత్తానికి సెకండ్ హాఫ్ లో వచ్చే హీరో హీరోయిన్ లవ్ ప్రొపోజ్ సీన్ హై లైట్.అక్కడ రామ్ చరణ్ ఎమోషన్స్ పీక్స్.ఆ మొత్తం 10 – 20 నిమిషాలు సినిమాని వేరే హైట్స్ కి తీసుకెళ్తుంది.సాంకేతికంగా సినిమా హై స్టాండర్డ్స్ తో వున్నా ఇంకా బెటర్ గా చేసుండొచ్చు అనిపిస్తుంది.బాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఇంపాక్ట్ ఉండుంటే బాగుండేది.ఎడిటింగ్ కూడా అక్కడక్కడా బెటర్ అవ్వొచ్చు.ముక్యంగా ఫెయిట్స్ బాగానే వున్నా ఎమోషన్ కి తగ్గ రేంజ్ లో ఎలివేట్ అవ్వలేదనిపిస్తుంది.మాటలు బాగున్నాయి.ముక్యంగా న్యూస్ పేపర్స్ లో న్యూస్ రాసే విధానం భలే చెప్పాడు.ఇంకా నా ప్రేమే నన్ను చంపేస్తోంటే నా శత్రువు నన్ను కాపాడాలని చూస్తున్నాడు వంటివి హై లైట్.స్క్రీన్ప్లే సూపర్బ్.

ఓవర్ అల్ గా రామ్ చరణ్ కి గీత ఆర్ట్స్ లో పడ్డ మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు.రామ్ చరణ్,అరవింద్ స్వామి,కథ,స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా స్టైలిష్ గా హేండిల్ చేసిన సురేందర్ రెడ్డి,క్లుప్తంగా ఇదీ ధ్రువ.కామెడీ,మాస్ పంచ్ లు,బిల్డుప్ సీన్స్ వంటి రెగ్యులర్ మసాలా ఆశిస్తే మాత్రం నిరాశే.

ధ్రువ TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share