పవన్ కి కేటీఆర్ అలా ఎర్త్ పెట్టారా..?

February 1, 2017 at 7:05 am
4

పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో.. తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ వ‌ద్దే నేర్చుకోవాలి! త‌న‌కు పోటీగా ఎవ‌రైనా వ‌స్తున్నార‌ని ఆయ‌న భావిస్తే చాలు.. ఎలా వారిని అణ‌గ‌దొక్కాలో బాగా తెలుసు. సొంత పార్టీలోనే మేధావుల‌ను సైతం లైన్లో పెట్టిన కేటీఆర్ ఇప్పుడు ప‌వ‌న్ లాంటి ప‌రాయి పార్టీ నేత‌ల‌ను ఎలా లైన్‌లో పెట్టాలో తెలీదా?! ఇప్పుడు అదే జ‌రిగింది తెలంగాణ‌లో.. ప‌వ‌న్ వ‌ల్ల త‌న ఇమేజ్‌కి భంగం వాటిల్లుతుంద‌ని అనుకున్న కేటీఆర్ రాత్రికి రాత్రి తీసుకున్న డెసిష‌న్‌.. అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. విష‌యంలోకి వెళ్లిపోతే..

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల ప‌ది రోజులుగా చేనేత రాగం అందుకున్నారు. నేత‌న్న‌ల దుస్థితి త‌న‌ను క‌లిచి వేస్తోంద‌ని స్టేట్ మెంట్లు ఇవ్వడంతోపాటు తాను కూడా నేత దుస్తులు ధ‌రిస్తాన‌ని చెప్పాడు. అక్క‌డి స్టోరీ అయిపోలేదు. తాను తెలంగాణ చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటాన‌ని అన్నాడు.

ఇదిగో ఈ డైలాగ్‌తో నే అస‌లు స్టోరీ స్టార్ట‌యింది. ప‌వ‌న్‌ని బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మిస్తే.. త‌న ఇమేజ్‌కి పెద్ద ఎత్తున డ్యామేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నాడో ఏమో మంత్రి కేటీఆర్‌.. వెంట‌నే రంగంలోకి సినీ తార, అక్కినేని వారి ఇంటి పెద్ద కోడ‌లు.. స‌మంత‌ని దింపేశాడు.

దీనివెనుక పెద్ద క‌స‌ర‌త్తే జ‌రిగింద‌ని తెలుస్తోంది. స‌మంతను బ్రాండ్ అంబాసిడ‌ర్‌ను చేయడంపై అక్కినేని నాగార్జున‌తో కేటీఆర్ మాట్లాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో ప‌వ‌న్‌ని నిలువ‌రించ‌డంపైనా ఆయ‌న పెద్ద ప్లాన్ వేశార‌ని తెలుస్తోంది. ఇప్పుడు చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌కి ఛాన్స్ ఇస్తే.. భ‌విష్య‌త్తులో దీనిని అడ్డం పెట్టుకుని పొలిటిక‌ల్ మైలేజీ కొట్టేస్తే.. క‌ష్ట‌మ‌ని కేటీఆర్ అనుకున్నార‌ట‌.

దీంతో ప‌వ‌న్‌ని పూర్తిగా నిలువ‌రించాలంటే.. అస‌లు అంబాసిడ‌ర్‌ను నియ‌మించేస్తే.. ఏ గొడ‌వా ఉండ‌దు క‌దా ? అని ప్లాన్ వేసి.. అక్కినేని వారి కోడ‌లిని రంగంలోకి దింపార‌నే టాక్ వినిపిస్తోంది. సో.. మొత్తానికి ప‌వ‌న్‌కి కేటీఆర్ ఇలా ఎర్త్ పెట్టాడ‌న్న‌మాట‌.

పవన్ కి కేటీఆర్ అలా ఎర్త్ పెట్టారా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share