పాలిటిక్స్ లోకి స్పోర్ట్స్ ఫైర్ బ్రాండ్…’రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తా.

February 28, 2017 at 9:40 am
130

బ్యాడ్మింట‌న్ లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన హైద‌రాబాదీ గుత్తాజ్వాల ఇక‌.. పాలిటిక్స్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటుంద‌ట‌! మొన్నామ‌ధ్య ప‌ద్మ పుర‌స్కారాల సంద‌ర్భంగా కేంద్రంపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డిన హాట్ బ్యూటీ.. త‌న‌కు ప‌ద్మ ఇవ్వ‌క‌పోవడంపై హాట్ హాట్ వ్యాఖ్య‌లే చేసేసింది. ఎవ‌రో వ‌చ్చి చెబితేనేగానీ ప‌ద్మ పుర‌స్కారాలు ఇవ్వ‌రా అంటూ నిల‌దీసింది. అయితే, ఈ బ్యూటీ సాధించిన ప‌త‌కాల క‌న్నా.. చేసిన కాంట్ర‌వ‌ర్సీలే ఎక్కువ‌ని క్రీడా ఫీల్డ్‌లో పెద్ద టాక్‌.

కొన్నాళ్లు క్రీడ‌ల్లో ఉన్నాక త‌న క‌న్నా చిన్నోడైన వాడితో మూడు ముళ్లు వేయించుకుంది. ఆ త‌ర్వాత అత‌నికి గుడ్ బై చెప్పి ఖాళీగానే ఉంది. ఆ త‌ర్వాత మూవీల్లోనూ ట్రై చేసింది. ఎక్స్‌పోజింగ్‌కు కూడా సై అంటూ.. నిత‌న్ తో క‌లిసి కొన్ని స్టిల్స్ కూడా ఇచ్చేసింది. అయినా ఎందుకో… గుత్తాను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అటు క్రీడ‌ల్లోనూ ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని వాపోతూ… మూవీలో ట్రెండ్ సృష్టిద్దామ‌ని ట్రై చేస్తే.. అక్క‌డా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

దీంతో ఇప్పుడు ఇంకో లైన్‌లో ముందుకు రావాల‌ని డిసైడ్ అయిన‌ట్టు చెప్పుకొచ్చింది. తాను త్వ‌ర‌లోనే పొలిటిక‌ల్‌గా ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటున్న‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించి హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా ఇప్ప‌టి వ‌ర‌కు క్రీడ‌ల నుంచి మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రూ ఇలా ఎంట్రీ ఇచ్చిన దాఖ‌లాలు లేవు. అయితే, తాను ఏ పార్టీలో చేరేదీ చెప్ప‌లేదు కానీ,త‌న‌కు మాత్రం పాలిటిక్స్ మీద పిచ్చి ప్రేమ ఉన్న‌ట్టు మాత్రం చెప్పుకొచ్చింది.  ఏ పార్టీలో చేరినా స్టార్ క్యాంపెయినర్ కావాలనుకోవడం లేదని స్పష్టం చేసింది.

‘రాజకీయాల్లోకి వస్తే క్రియాశీలకంగా పనిచేస్తా. నాకు అప్పగించిన పదవికి న్యాయం చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. నేను స్టార్ క్యాంపెయినర్ కావాలనుకోవడం లేద’ని జ్వాల పేర్కొంది. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ అడగ్గా… ఆమె సానుకూలంగా స్పందించింది. ‘ప్రజా సమస్యలు, అభివృద్ధిపై పవన్ గళం విన్పిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నార’ని జ్వాల అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆమె.. జనసేన పార్టీలో చేరతారని ప్రచారం మొదలైంది.  మ‌రి ఇక్క‌డైనా.. ఇప్పుడైనా జ్వాల‌కు గుర్తింపు ల‌భిస్తుందో లేదో చూడాలి.

పాలిటిక్స్ లోకి స్పోర్ట్స్ ఫైర్ బ్రాండ్…’రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తా.
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share