ప‌వ‌న్ పాలిటిక్స్‌పై నీకు క్లారిటీ ఉందా..?

December 17, 2016 at 11:36 am
Pawan Kalyan

ప్ర‌శ్నిస్తా! -అంటూ పొలిటిక‌ల్ అరంగేట్రం చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చుట్టూ ఇప్పుడు అవే ప్ర‌శ్న‌లు చుట్టుముడుతున్నాయి. తాను ఎవ‌రినైతే ప్ర‌శ్నిస్తాన‌ని, ఎవ‌రి త‌ర‌ఫునైతే ప్ర‌శ్నిస్తాన‌ని చెబుతూ సొంత పార్టీ పెట్టుకున్నాడో అదే ప‌వ‌న్‌కి ఇప్పుడు ప్ర‌జ‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. అవి అలాంటి ఇలాంటి ప్ర‌శ్న‌లైతే.. పెద్ద చ‌ర్చ ఉండేది కాదు. కానీ దిమ్మ‌తిరిగిపోయే ప్ర‌శ్న‌ల‌తో ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు. ప‌వ‌న్‌.. అస‌లుపాలిటిక్స్ అంటే ఏమిటో తెలుసా? నీకు అస‌లు పాలిటిక్స్‌పై క్లారిటీ ఉందా? రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏం చేయాల‌నుకుంటున్నావ్‌? ఇవీ.. ఇప్పుడు ప్ర‌జ‌లు సంధిస్తున్న ప్ర‌శ్న‌లు!

వాస్త‌వానికి అధికారంలో లేని ఏ పార్టీ అయినా.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున అధికారంలో ఉన్న‌వారిని ప్ర‌శ్నించ‌డమో, పోరాడ‌డ‌మో చేస్తుంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌పై ఏపీ ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. త‌మ స‌మ‌స్య‌లు తీర‌తాయ‌ని అనుకున్నారు. కానీ, గ‌డిచిన మూడు స‌భ‌లు స‌హా ఇటీవ‌ల చేస్తున్న ట్వీట్ల‌లోనూ ప‌వ‌న్ వైఖ‌రి ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని చెబుతూనే.. ముందు మీరు పోరాడండి అంటూ టీడీపీ, వైకాపా ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు పిలుపు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. ఇక‌, హోదా రాక‌పోవ‌డంలో బీజేపీది ఎంత పాత్ర ఉందో అధికార టీడీపీదీ అంతే ఉంది.

అయినా కూడా ప‌వ‌న్ ఎక్క‌డా టీడీపీపై ప‌న్నెత్తు మాట అన‌కుండా.. బీజేపీని, వెంక‌య్య‌ని తిట్టిపోస్తున్నాడు. పోనీ, న‌రేంద్ర మోడీని ఏమైనా అంటే.. వ‌ర్క‌వుట్ అవుతుంది. ఆదిశ‌గా కూడా ప‌వ‌న్ ఎలాంటి కామెంట్లూ చేయ‌డు. ఇక‌, పార్టీకి కేడ‌ర్‌ను నింప‌డంలోనూ ఎలాంటి చ‌ర్య‌లూ చూపించ‌డు. పోనీ 2019 ఎన్నిక‌ల నాటికైనా.. జ‌న‌సేన‌ను జ‌నాల్లోకి తీసికెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాడా? అంటే అదీ లేదు. ఇక‌, ఏపీలో పాల‌న పైకి మేడిపండును త‌ల‌పిస్తోంద‌నేది ప్ర‌తి ఒక్క‌రిటాక్‌. బాబు ఎన్ని నీతులు చెబుతున్నా.. త‌మ్ముళ్ల దందాలకు ఎవ‌రూ అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నారు.

మంత్రులు స‌హా ఎమ్మెల్యేలు.. అవినీతి సొమ్మును ఆబ‌గా బొక్కేస్తున్నారు. ఈ విష‌యంపై ప‌వ‌న్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియ‌దు. ఇక‌, విజ‌య‌వాడ‌ను కుదిపేసిన కాల్‌మ‌నీ వ్య‌వ‌హారంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శ్నించిన‌వారు లేరు. ఇవ‌న్నీ వ‌దిలేసి.. ప‌వ‌న్ ఏడాది కింద‌ట స‌మ‌సిపోయిన రోహిత్ వేముల విష‌యాన్ని తొవ్వి పైకితెచ్చాడు. అదేవిధంగా అస‌లు మ‌న రాష్ట్రంలో పెద్ద చ‌ర్చ‌నీయాంశం కాని గోవ‌ధ‌పై చ‌ర్చ‌కు తెర‌దీశారు. ఎందుకు ఇలా చేస్తున్నాడో ప‌వ‌న్‌కైనా తెలుసా? అనేది పుర‌జ‌నుల ప్ర‌శ్న‌! మ‌రి ఇలాగైతే.. పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా ఒకింత క‌ష్ట‌మే అనేది వారి మాట‌!! ప‌వ‌న్.. ఇప్ప‌టికైనా మార‌తావా..?

 

ప‌వ‌న్ పాలిటిక్స్‌పై నీకు క్లారిటీ ఉందా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share