మహేష్ కి 150 కోట్ల ఆఫర్!

July 15, 2016 at 12:23 pm
3850_Mahesh-Babu

మహేష్ మార్కెట్ రేంజ్ ఎంతో అందరికి తెలిసిందే.హిట్,ప్లాప్ తో సంబంధం లేకుండా మహేష్ మార్కెట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.ఇక శ్రీమంతుడు సినిమాతో మహేష్ స్టామినా ఎంతో మరోసారి చూపించాడు.తెలుగు లో బాహుబలి తర్వాత 150 కోట్ల మార్క్ ని మహేష్ తప్ప ఇంకెవ్వరూ టచ్ చేయలేకపోయారు.అది ప్రిన్స్ మహేష్ స్టామినా.

కాగా తాజాగా మహేష్,మురుగుదాస్ కంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుంది.ఈ సినిమా ఈనెల 29నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. రూ.100కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంకో ఆసక్తికర వార్త బయటికొచ్చింది.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి రిలయన్స్ వారు రూ.150 కోట్లను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది.ఈ మొత్తం తెలుగు,తమిళ్ థియేటర్ హక్కులు,శాటిలైట్ తో కలుపుకుని మిగిలిన అన్నిరకాల హక్కులను కలిపి ఆఫర్ చేసినట్టు సమాచారం.

మురుగుదాస్ కి తమిళ్,హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అదీ కాక మహేష్ కూడా డబ్బింగ్ సినిమాలతో తమిళ్,హిందీ ప్రేక్షలకు దగ్గరయ్యాడు.కాబట్టి ఈ సినిమాకి మార్కెట్ రేంజ్ ఎక్కువ. ఇవన్నీ కలిపి చూసుకుంటే భారీ ఓపెనింగ్స్ వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రిలయన్స్ వారు ఈ ఆఫర్ ఇచ్చునంటారని వినికిడి.అయితే దీనిపై ఇంకా ఇరువర్గాలు చర్చింస్తున్నారని,త్వరలోనే అన్ని విషయాలు బయటికొచ్చే అవకాశం ఉంది.

మహేష్ కి 150 కోట్ల ఆఫర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share