లోకేష్‌ కోసం ఆయ‌న త్యాగం చేయాల్సిందేనా..!

February 25, 2017 at 10:31 am
Lokesh

ఎవ‌రు.. ఆ ఒక్క‌రు ఎవ‌రు? చిన‌బాబు కోసం మంత్రి ప‌ద‌వి త్యాగం చేసేవారు ఎవ‌రు? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీచేస్తే.. రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు. కానీ ఎమ్మెల్సీగా పోటీచేయ‌డంతో చిక్కు వ‌చ్చిపడింది. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గం నుంచి ఉద్వాస‌న ప‌లికే వారి స్థానంలో కొత్త వారి పేర్లు దాదాపు ఖ‌రార‌య్యాయి. ఇక ఎవ‌రో ఒక‌రిని ప్ర‌త్యేకంగా తొల‌గించి త‌న త‌న‌యుడికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి వ‌స్తుంది. అందుకే త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడైన‌, `బాగా` కావాల్సిన నారాయ‌ణ‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట చంద్ర‌బాబు! అంతేగాక అందుకు త‌గిన `ప్ర‌తిఫ‌లం` కూడా ద‌క్కేలా ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌.

సీఎం చంద్ర‌బాబు కుమారుడు లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి దాదాపు ఖరారు అయిపోయింది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ఇదే మంచి త‌రుణ‌మ‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఎవ‌రిని త‌ప్పించాలి… ఎవ‌రిని ఒప్పించాలి అనే అంశంపై తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌. ఇప్ప‌టికే పీత‌ల సుజాత‌, రావెల కిషోర్ బాబు, మృణాళిని, ప్ర‌త్తిపాటి, ప‌ల్లె ర‌ఘునాధ‌రెడ్డిని మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పిస్తార‌నేది దాదాపు ఖ‌రారైంది. వీరితో పాటు మంత్రి నారాయ‌ణ కూడా చిన‌బాబు కోసం త‌న మంత్రి ప‌ద‌విని త్యాగం చేయ‌డం త‌ప్ప‌డం లేద‌ట‌.

నారా లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని చాలా రోజులుగా నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కూ చోటు కల్పించాల‌ని బాడు డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్సీ కోటాలో ఆయ‌న్ను చట్ట‌స‌భ‌ల‌కు పంపి.. త‌ర్వాత కీల‌క‌మైన మున్సిప‌ల్‌, ఐటీ శాఖ‌ల్ని అప్ప‌గించాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే, మంత్రి నారాయ‌ణ‌కు మార్పు త‌ప్ప‌ద‌నే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఇదే విష‌యాన్ని ఆయ‌న‌కి సున్నితంగా న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

అయితే మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు బ‌దులుగా మ‌రో విధంగా సంతృప్తి ప‌ర‌చాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం నారాయ‌ణ రాజ‌ధాని ప్రాంత అభవృద్ధి ప్రాధికార సంస్థ‌(సీఆర్డీయే)లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించినా, రాజ‌ధాని సంస్థ‌కు ఛైర్మ‌న్‌గా నియ‌మించి లెక్క స‌రిచేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఈ ప‌ద‌వికి కూడా క్యాబినెట్ హోదా క‌ల్పించి.. నారాయ‌ణ‌ను సంతృప్తిప‌ర‌చాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. మ‌రి బాబు ఆఫ‌ర్‌ని నారాయ‌ణ ఒప్పుకుంటారో లేదో!!

 

లోకేష్‌ కోసం ఆయ‌న త్యాగం చేయాల్సిందేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share