వైకాపాలోకి రాజ‌కీయ మేథావి..!

December 18, 2016 at 6:44 am
YSRCP

స‌మైక్యాంధ్ర రాజ‌కీయాల్లో త‌ల‌పండిన మేథావిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ సీనియ‌ర్ పొలిటిషీయ‌న్ అడుగ‌డుగులు వ‌డివ‌డిగా ఇప్పుడు వైసీపీ వైపే ప‌డుతున్నాయి. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆ వ్య‌క్తికి దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి వీక్‌నెస్‌గా పేరుంది. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు మాజీ ఎంపీ, అప‌ర రాజకీయ చాణుక్యుడుగా పేరున్న ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌.

కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత న‌మ్మ‌క‌స్తుల్లో ఒక‌రు. ఉండ‌వ‌ల్లి మాట అంటే వైఎస్ వేదంగా భావించే వారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఉండ‌వ‌ల్లి ఆయ‌న మీద మాట ప‌డ‌నిచ్చేవారు కాదు. ఈనాడు అధినేత రామోజీరావుతోనే ఢీకొట్టిన చ‌రిత్ర ఉండ‌వ‌ల్లిది. కొద్ది కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటోన్న ఉండ‌వ‌ల్లిని తిరిగి రీ పొలిటిక‌ల్ ఎంట్రీ చేయించేందుకు వైఎస్ త‌న‌యుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్లాన్లు రెడీ చేస్తున్నార‌ట‌.

ఇత‌ర పార్టీల నేత‌ల‌ను, సీనియ‌ర్ల‌ను వ‌రుస పెట్టి పార్టీలో చేర్చుకుంటోన్న జ‌గ‌న్ ఉండ‌వ‌ల్లిపై కూడా క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. ఉండ‌వ‌ల్లి లాంటి రాజ‌కీయ మేథావి త‌న ప‌క్క‌న ఉంటే త‌న‌కు కొండ‌త బ‌లం ఉంటుంద‌ని, మంచి ఆలోచ‌న‌లు కూడా ఆయ‌న నుంచి స్వీక‌రించ‌వ‌చ్చ‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఇదే క్ర‌మంలో ఉండ‌వ‌ల్లికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన రాజ‌మండ్రి లోక్‌స‌భ సీటు ఆఫ‌ర్ చేశార‌ట‌.

ఉండ‌వ‌ల్లి సైతం జ‌గ‌న్ చెంత‌కు చేరేందుకు సుముఖంగానే ఉన్నార‌ట‌. గ‌తంలో వీరిద్ద‌రు మీట్ అయ్యారు. అప్పుడే ఉండ‌వ‌ల్లి వైసీపీ జెండా క‌ప్పుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగినా కాస్త లేట్‌గా ఉండ‌వ‌ల్లి ఇప్పుడు జ‌గ‌న్ చెంత‌కు చేరుతున్నార‌ట‌. ఇందుకోసం ఇప్ప‌టికే వీరీద్ద‌రి మ‌ధ్య ప్రాథ‌మికంగా చ‌ర్చ‌లు కూడా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. కొద్ది కాలంగా మ‌రుగున ప‌డిన ఉండ‌వ‌ల్లి ఇప్పుడు వైకాపాతో రీ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తే మ‌ళ్లీ ఆన్ పొలిటిక‌ల్ స్క్రీన్‌పై ఉండ‌వ‌ల్లి ఛ‌లోక్తులు మామూలుగా ఉండ‌వేమో.

 

వైకాపాలోకి రాజ‌కీయ మేథావి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share