హీటెక్కిన హిందూపురం టీడీపీ పాలిటిక్స్

February 6, 2017 at 6:40 am
35000

టీడీపీ కంచుకోట హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది! ఇక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్ర‌బాబు వియ్యంకుడు, సినీ హీరో బాల‌య్య ఇమేజ్ వీధుల పాలైపోతోంది. ముఖ్యంగా ఆయ‌న త‌న నియోజ‌క వ‌ర్గానికి చుట్టపు చూపుకే ప‌రిమితం కావ‌డం, ఉన్న టైం మొత్తం సినిమా షూటింగుల‌తో గ‌డిపేస్తున్నాడు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో త‌న బాధ్య‌త‌లు నెర‌వేర్చేందుకు త‌న అనుచ‌రుడు శేఖ‌ర్‌కి బాధ్య‌త‌లు అప్ప‌గించాడు బాల‌య్య‌. అయితే, ఇదే అవ‌కాశంగా భావించిన శేఖ‌ర్ త‌న‌దైన శైలిలో రెచ్చిపోతున్నాడ‌ని, అయిన దానికీ, కాని దానికీ వ‌సూళ్ల‌కు తెర‌లేపుతున్నాడ‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా అన‌ధికార ఎమ్మెల్యేగా శేఖ‌ర్ రెచ్చిపోతున్నాడ‌ని, త‌మ‌నుకూడా లెక్క‌చేయ‌డం లేద‌ని సాక్షాత్తూ టీడీపీ నేత‌లే ఆరోపిస్తున్నారు. అంతేకాదు, అత‌నిని త‌క్ష‌ణ‌మే తొల‌గించ‌క‌పోతే.. తామంతా పార్టీకి రాజీనామా చేస్తామ‌ని కూడా వారు హెచ్చ‌రించే ప‌రిస్థితి వ‌చ్చింది. అసమ్మతిని లేవనెత్తిన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ వర్గీయులు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు, బలనిరూపణల‌కు దిగుతున్నారు. దీంతో బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర‌స్థాయిలో బ‌హిరంగ పోరుకు తెర‌లేచింది.

నియోజ‌క‌వ‌ర్గంలోని చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ శనివారం రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా అసమ్మతినేతలు చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి నాయకులను కూడగడుతున్నారు.  వీధుల్లోకి చేరి శేఖ‌ర్‌కి వ్య‌తిరేకంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసేందుకు సైతం వారు సిద్ధ‌మ‌య్యారు. ఈ ప‌రిణామం చూస్తే.. టీడీపీ కంచుకోట‌కు బీట‌లు వారే ప‌రిస్థితి ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఈ విష‌యంలో బాల‌య్య ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

హీటెక్కిన హిందూపురం టీడీపీ పాలిటిక్స్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share