అల్లు వారి దెబ్బకి “పెళ్లిచూపులు” ఆగేదా?

మెగా ఫామిలీ నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే తాజాగా వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఈ హీరో కి మంచివిజయాన్నే ఇచ్చింది. దీనితో మెగాహీరోస్ వరుసలో 8వ. నెంబర్ ని సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ శిరీష్ తండ్రి అల్లు అరవింద్ మాత్రం తన కొడుకు ఒక మంచి సినిమా ని మిస్ అయిపోయాడని తెగ ఫీలవుతున్నాడని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు.

ఆ సినిమా మరేదో కాదు ఈ మధ్యే రిలీజ్ అయ్యి పెద్ద హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ‘పెళ్లి చూపులు’. విజయ్ హీరోగా ఈ సినిమాను నిర్మించిన దర్శకనిర్మాతలు ఈ సినిమా విడుదల కోసం అల్లు అరవింద్‌ను సంప్రదించారట. అయితే సినిమా చుసిన అల్లు అరవింద్ బాగా నచ్చటం తో సినిమా ని రిలీజ్ చేయకుండా ఆపేసి, తన కొడుకు శిరీష్ ని హీరోగా పెట్టి మళ్ళీ తీద్దామని అన్నాడట. అంతే కాదు దీనికోసం అల్లు పెద్దమొత్తమే ఆఫర్ చేసాడట.

అయితే, మళ్లీ తీసిన సినిమానే ఎక్కడ తీస్తామని భావించిన దర్శకనిర్మాతలు సురేశ్ బాబును సంప్రదించడంతో సినిమా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. ఏదయితేనేం సినిమా మంచిహిట్ అవడం తో విజయ్ కి కూడా మంచి బ్రేక్ వచ్చింది అనుకుంటున్నారు. నిజమే అనిపిస్తుంది కదా!