ఇందుకా నిన్ను మేయర్ ని చేసింది?

ప్రతిష్టాత్మకమైన GHMC ఎన్నికల్లో చరిత్ర సృష్టించి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది అధికార తెరాస పార్టీ.పార్టీ కి ఎంతో కాలంగా సేవ చేస్తున్న బొంతు రామ్మోహన్ కి మేయర్ పదవి కట్టబెట్టి విశ్వాసానికి పెద్ద పీట వేశారు కెసిఆర్.అయితే నగరం లో సమస్యలు తిష్ట వేసిన నేపథ్యం లో మేయర్ వ్యవహార శైలిపై సీఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

బుధవారం నగరంలో వైట్‌టాపింగ్ రోడ్లు, తదితర అంశాలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.అనంతరం తరచు విదేశీ పర్యటనలకేతున్న మేయర్ రామ్మోహన్ ను సీఎం గట్టిగానే హెచ్చరించినట్టు సమాచారం. రెండు నెలల క్రితం ఫ్రాన్స్, నాలుగు రోజుల క్రితం ఆస్ట్రేలియాకు మేయర్ వెళ్లిన సంగతి తెలిసిందే.

దీన్ని దృష్టిలో ఉంచుకునే మన పనులు మనమే చూసుకోవాలి కానీ ఇలా విదేశీ పర్యటనలతో ఎవరికి లాభమని సీఎం ప్రశ్నించినట్టు సమాచారం.ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇకపైన ఈ అనవసరపు విదేశీ పర్యటనలు కట్టిపెట్టాలని సీఎం క్లాస్ తీసుకున్నారు.అసలే నగర వాసులు వర్షాలకు ఎప్పుడు ఎక్కడ ఏ భవనం కూలుతుందో అని ఆందోళన చేయెండుతున్నారు.ఇక రోడ్ల సంగతి చెప్పనక్కర్లేదు.రోజు గంటలకొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుని నగరవాసులు నరకయాతన పడుతున్నారు.ఇన్ని సమస్యలుంటే తాపీగా విదేశీపర్యటనలెలా అని కెసిఆర్ ప్రశ్నించారు.ఇందుకేనా నీకు మేయర్ పదవి కట్టబెట్టింది అని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.