ఇజం TJ రివ్యూ

సినిమా : ఇజం
రేటింగ్ : 2.5/5
పంచ్ లైన్ : ‘పూర్’ఇజం

నటీనటులు : నందమూరి కళ్యాణ్రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్రెడ్డి, ఆలీ, వెన్నెల కిషోర్.
సంగీతం : అనూప్ రూబెన్స్.
పాటలు : భాస్కరభట్ల.
సినిమాటోగ్రఫీ : ముఖేష్.
ఎడిటింగ్ : జునైద్.
ఫైట్స్ : వెంకట్
నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్
కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాథ్

అగ్ర రాజ్యం అమెరికా తో పాటు అనేక దేశాలకు ముచ్చమటలు పట్టించిన,పట్టిస్తూనే ఉన్న వికీ లీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే స్పూర్తితో దర్శకుడు పూరి ఓ లైన్ అనుకుని కథనల్లుకున్నాడు.అయితే ఆ లైన్ బానే వుంది కానీ దాని చుట్టూ అల్లిన కథే డొల్లయిపోవడంతో సినిమా తేలిపోయింది.

ఎన్టీఆర్ తో టెంపర్ లాంటి హిట్ కొట్టిన పూరి నుండి నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా అనగానే అందరిలోనూ అదే స్థాయి అంచనాలున్నాయి.కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ కావడం,సినిమాకి ఇజం అనే టైటిల్ బాగా జనాల్లోకి వెళ్లడం తో సినిమా పైన మంచి అంచనాలేర్పడ్డాయి.అయితే పూరి అనుకున్న పాయింట్ ని అయితే సరిగ్గా ప్రెసెంట్ చేసాడు కానీ రెండుగంటల పైగా ప్రేక్షకుల్ని సినిమాలో కూర్చోబెట్టే కథనం లేదీ ఇజం లో.

ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది.. అది వాళ్ళ నాచురల్ పంథా..అంటే వాళ్ళు తీసే సినిమాల్లో ఎక్కువగా అదే ఫ్లేవర్ కనిపిస్తుంది.మరీ ముక్యంగా పూరి సినిమా అనగానే ఎలా ఉంటుంది ముక్యంగా హీరో బిహేవియర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.అయితే మనం ఎంచుకున్న కథేంటి దాని చుట్టూ అల్లే కథనం ఎలా ఉండాలి అని ఆలోచించకుండా మనకంటూ ఓ స్టైల్ వుంది కదా దాన్నే దీనిక్కూడా రుద్దేస్తే పోలా అని ఇజం చుట్టూ పూరి మార్క్ కథనాన్ని అల్లేసి వండి వార్చేసాడు పూరి.

రౌడీలకు భయపడి కొడుకుని కాపాడుకోవడం కోసం నిజాన్ని తన జర్నలిస్ట్ తండ్రి చంపేయడం చిన్నప్పుడే చుసిన ఓ కుర్రాడు నా దేశం లో జర్నలిస్ట్ లు భయపడకూడదు అనే ఆలోచన నుండి అసాంజే మాదిరిగా ఎం చేసాడు అన్నదే కథ.ఈ మెయిన్ ప్లాట్ కి రెండుగంటలు సినిమాని నడిపే కంటెంట్ సినిమాలో మిస్ అయ్యింది.మెయిన్ ప్లాట్ ఒక వైపు..ఎదో కాలక్షేపం కోసం అన్నట్టు అల్లిన కథ ఒక వైపు రెండు పడవలపై ప్రయాణం అన్నట్టు సాగుతుంది సినిమా ఆద్యంతం.

పూరి కి పాపం గ్యాంగ్స్టర్ లు అన్నా,మాఫియా అన్నా ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటూనే వుంది.అది మరో సారి జావేద్ ఇబ్రహీం అంటూ జగపతి బాబు రూపం లో ఆ సరదా తీర్చుకునే ప్రయత్నం చేసాడు.జగపతి బాబు చుట్టూ రాసిన,తీసిన సన్నివేశాలన్నీ తేలిపోయాయి.అండర్ వరల్డ్ డాన్ కరీం బీడీ కోసం పాకులాడటం లాంటి సన్నీ వేశాలు మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.గ్యాంగ్స్టర్,కూతురి బాండింగ్ కూడా ఎక్కడా కనెక్ట్ అవ్వదు ఆడియన్స్ కి.ఎదో టెంపర్ లో లాగా క్లైమాక్స్ భారీగా వుండబొంతోంది అందుకని అంతవరకు కథను ఎలాగోలా లాక్కొచ్చేద్దాం అన్న తాపత్రయం కనిపిస్తుంది.ఒకటి కాదు రెండు క్లైమాక్స్ లు చూపించాడు పూరి.ఎవరికీ ఏది నచ్చితే అది ఉంచుకుని ఇంకోటి మర్చిపొమ్మనేమో దాని ఉద్దేశం.

కళ్యాణ్ రామ్ 100% డెడికేషన్ కనిపిస్తుంది ఈ సినిమాలో..సత్య మార్తాండ కళ్ళల్లో ఉండాల్సిన ఫైర్ కళ్యాణ్ రామ్ లో కనిపిస్తుంది.అందరు హీరో లు పూరితో సినిమా అనగానే ఎందుకంత ఇంటరెస్ట్ చూపిస్తారో కళ్యాణ్ రామ్ యాక్టింగ్ లో చూపించిన ఈజ్ చూస్తే తెలుస్తుంది.కళ్యాణ్ రామ్ బాడీ,డ్రెస్సింగ్,అప్పీరెన్స్ అన్ని చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి.ఇక జగపతి బాబు ఎప్పుడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తాడో అన్నట్లుంది ఆ పాత్ర పాపం.హీరోయిన్ వచ్చి రాని నటనతో ఎదో ట్రై చేసింది.మిగిలిన వాళ్ళు ఎవ్వరి పరిధిమేరలో వాళ్ళు నటించారు.

టెక్నికల్ గా ఇంకా హై స్టాండర్డ్స్ ఉండుంటే బాగుండేది.మ్యూజిక్ అంతంత మాత్రమే,పాటలు ప్రేక్షకులకి సిగరెట్ బ్రేక్స్ కి తప్ప ఇంకెందుకూ పని చేయవు..డైలాగ్స్ పూరి స్టైల్ లో ఎప్పటిలాగే వున్నాయి..కొత్తగా ఎక్కడా అనిపించవు.నిర్మాతగా మాత్రం కళ్యాణ్ రామ్ ఎక్కడా కంప్రమైస్ అవ్వలేదు.

ఓవర్ అల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ శంకర్ సబ్జెక్టు ని పూరి జగన్నాథ్ డీల్ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అలాగే ఉందీ ఇజం.పాపం పూరికి ఒక్కో సీజన్లో లో ఒక్కో థీమ్ మైండ్ కి ఎక్కేసి దాన్నుండి అంత తొందరగా బయట పడలేదేమో అనిపిస్తుంది.ఇంకా పాపం ఆ పోకిరి తాలూకు కథలు,కథనాల చుట్టూనే పూరి తిరుగుతున్నాడు..కాకపోతే అక్కడక్కడా టెంపర్ ఫ్లేవర్ కూడా ఆడ్ అయ్యింది ఇప్ప్పుడు అంతే.