నాగ చైతన్య సినిమాలు వరుసగా రిలీజ్‌కి రెఢీగా ఉన్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వెంటనే ఒక నెల గ్యాప్‌లో రెండో సినిమా ‘ప్రేమమ్’ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ లోపల చైతూ మరో కొత్త సినిమాకి సైన్ చేశాడన్న సంగతి తెలిసిందే.
‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో నాగార్జునకి రొమాంటిక్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చైతూ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మొదట్లో సమంతని హీరోయిన్గా అనుకున్నారు. ఆ తరువాత ఆ ప్లేస్‌లోకి తమన్నా వచ్చి చేరింది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే బాగుంటుందని అంటున్నాడట చైతూ. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంతని కూడా హీరోయిన్గా ఉంచాలని పట్టు పడుతున్నాడట చైతూ.
అయితే మెయిన్ హీరోయిన్గా కాదనీ, గెస్ట్ రోల్ మరియు ఒక సాంగ్ ఉండేలా ప్లాన్ చెయ్యాలని డైరెక్టర్‌కి సూచిస్తున్నాడట నాగ చైతన్య. ప్రస్తుతం సమంత ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా తరువాత సమంత మరే ఇతర సినిమాని ఒప్పుకోలేదని సమాచారమ్. కానీ నాగ చైతన్య కోసమే ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకుందని గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే ఇంతకీ ఈ సినిమాలో నిజంగా సమంత నటిస్తుందా? లేక ఇదంతా గాసిప్స్నా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.