ఏపీ మంత్రి ఫై బాబు పవర్ పంచ్

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ప‌వ‌ర్ చూపించారా?  త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తే.. పైకి మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. తెర‌వెనుక చేయాల్సింది చేస‌స్తాన‌ని బాబు చేసి చూపించారా? ఎంత‌టి వారైనా త‌న‌కు లోబ‌డే ఉండాల‌నే సిగ్న‌ళ్ల‌ను చంద్ర‌బాబు పంపించారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది రెవెన్యూ శాఖ నుంచి! అదేంటి? అని అనుకుంటున్నారా? అయితే, ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే! త‌న మంత్రి వ‌ర్గంలో కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి.. రెండు నెల‌ల కింద‌ట చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు కురిపించారు. ఓ స‌భ‌లో మాట్లాడుతూ.. అస‌లు మా నాయ‌కుడు ఏం చేస్తున్నాడో నాకే అర్థం కావ‌డం లేదు. అని అన్నారు.

అంత‌టితో ఆగ‌కుండా.. రాజ‌ధాని భూముల విష‌యంపైనా కేఈ ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు. సీమ‌ను అభివృద్ధి చేయాల‌నే త‌న‌కు ఉంద‌ని అయితే, త‌మ నాయ‌కుడు స‌హ‌కారం అంతంత మాత్రంగా ఉంద‌ని బాహాటంగానే విమ‌ర్శించారు. ఈ ప‌రిణామం అప్ప‌ట్లో చంద్ర‌బాబును విమ‌ర్శించే ప‌త్రిక‌ల్లో ఫ‌స్ట్ పేజీల్లో వ‌చ్చింది. దీంతో బాబు హ‌ర్ట్ అయ్యారు. అయితే, స‌మ‌యం చూసుకుని స‌మాధానం గ‌ట్టిగా చెప్పాల‌నుక‌న్నారో ఏమో.. అప్ప‌ట్లో మాత్రం మౌనం వ‌హించారు. కానీ, ఇప్పుడు జ‌రుగుతున్న‌, జ‌రిగిన ప‌రిణామాల‌ను చూస్తే.. కేఈకి బాబు ఎంత షాకిచ్చారో తెలుస్తోంది. నోరు అదుపులో పెట్టుకోక‌పోతే ఏం జ‌రుగుతుందో అర్ధ‌మ‌వుతుంది.

వాస్త‌వానికి కేఈ నిర్వ‌హిస్తున్న రెవెన్యూ శాఖ‌కు మంచి బ‌ల‌మున్న శాఖ అనే పేరుంది. ఎవ‌రైనా ముందుగా కోరుకునేది ఈ శాఖ‌నే. ఎందుకంటే నేరుగా ప్ర‌జ‌ల‌తో నిత్యం సంబంధం ఉండే శాఖ‌ల్లో ఇది ప్ర‌ధాన‌మైంది. అంతేకాదు, భారీ మొత్తంలో అడ‌గ‌కుండానే డ‌బ్బులొచ్చే శాఖ ఇది. అలాంటి శాఖ‌ను నిర్వ‌హిస్తున్న కేఈకి ఇప్పుడు చంద్ర‌బాబు వాత పెట్టార‌ట‌! ఆయ‌న అధికారాల‌ను చాప కింద నీరులాగా త‌న ప‌రిధిలోకి మ‌ళ్లించుకున్నార‌ని రెవెన్యూ ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. మండ‌లాల స్థాయిలో కీల‌క‌మైన తాసీల్దార్ల‌పై క‌లెక్ట‌ర్ల‌కు అధికారం ఉంటే.. డిప్యూటీ క‌లెక్ట‌ర్లు, ఆర్డీవోలు వంటి కీల‌క‌మైన శాఖ‌పై నేరుగా రెవెన్యూ మంత్రికే అధికారం ఉంటుంది.

కానీ, ఇటీవ‌ల కేఈకి ఈ అధికారాల‌ను తొల‌గించార‌ని తెలుస్తోంది. దీంతో ఆయ‌నకు ఏ అధికారిపైనా ప‌ట్టు లేకుండా పోయింద‌నే టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే భూముల విష‌యంలో మంత్రి మండ‌లికి పూర్తి అధికారాల‌ను క‌ట్ట‌పెట్టారు. ఇప్పుడు దిగువ స్థాయి అధికారుల విష‌యంలోనూ మంత్రి కేఈకి ఎలాంటి అధికార‌మూ లేకుండా చేశారు బాబు. దీంతో ఇప్పుడు కేఈకి ప‌నిలేకుండా పోయింద‌ని అంటున్నారు అధికారులు. ఈ ప‌రిణామం చూస్తే.. కేఈ ఇక మంత్రి వ‌ర్గంలో ఉత్స‌వ విగ్ర‌హం టైపేన‌నే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. బాబు దెబ్బ ఇంత సీరియ‌స్‌గా ఉంటుంద‌ని కేఈ ఊహించి ఉండ‌రు. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో.. ఈ ప‌రిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.