ఒట్లు సరే..దీని సంగతేంటీ రెడ్డి గారూ ..

రాజకీయ నాయకుల దిగజారుడుతనం తారాస్థాయికి చేరింది.సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాటిపోయి పెళ్ళాలు పిల్లలపైనే ఏకంగా ఓట్లు వేసేస్తున్నారు.అయ్యా అమరనాథరెడ్డి నువ్వు అంత నిప్పువే అయితే,నువ్వేదో గాంధిజీ కి అసలైన వారసుడినన్నట్టు బిల్డుప్ ఇస్తున్నావ్ కదా.ఈ ఒట్లు,సవాళ్ళు పక్కనబెట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నువ్వు ఇంకో పార్టీలో చేరేముందు నీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ప్రజాక్షేత్రం లో నిలబడు.అప్పుడు నువ్వెంతో నీ విలువెంతో తెలుస్తుంది.

ఇక టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డిపై వీ. కోట మండల కేంద్రంలో ప్రదర్శించిన ఓ బ్యానర్ అందర్నీ ఆకట్టుకుంది,ఆలోచింపచేసింది. ఆ బ్యానర్లో ఏముందంటే… ఆ రోజు పార్టీలోకి ఎవరూ మిమ్మల్ని రమ్మనలేదు… అలాగే ఈ రోజు మీరు వెళతానంటే ఎవరూ ఆపేది లేదని.. కానీ మిమ్మల్ని మేము ఓట్లు వేసి గెలిపించింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అని గుర్తుంచుకోండన్నారు.అమర్నాథ్రెడ్డి గారు మీరు పార్టీ మారతారో లేక గంగలో దూకుతారో మీ ఇష్టం… కానీ మా ఓటు మాకు తిరిగిచ్చేసి పార్టీ మారండి… ఓటర్లుగా మాకు విలువ వుంది. ఓటుకు కూడా ఎంతో విలువ ఉంది. తరచూ పార్టీలు మారే ఎంఎల్ఏగా మీకు విలువుందా ? అని బ్యానర్ ద్వారా ప్రశ్నించారు. సిగ్గు… సిగ్గు.. అని బ్యానర్లో రాసి ఉంది.

వేల్లేవాడివి వెళ్లక నీకెందుకు ఈ నీతిమాలిన నీతి కబుర్లు.చెప్పేవి శ్రీరంగ నీతులును దూరేవేమో దొమ్మరి గుడిసెలా.పార్టీ ఫిరాయింపులు సర్వ సాధారనమైపోయిన ఈ రోజుల్లో అమర్నాథ్రెడ్డి వ్యాక్యాలు ఆపైన నియోజకవర్గం లో వినూత్న నిరసన భవిష్యత్ లో ఫిరాయించే వారినైనా ప్రజాస్వామ్య విలువల గురించి ఆలోచింప చేస్తుందేమో చూద్దాం.