చిక్కులో పడ్డ బోయపాటి

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ డైరెక్టర్ గా ప్రత్యేకమయిన గుర్తింపుతెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ తో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్బూస్టర్స్ కొట్టాడు తర్వాత స్టయిలిష్స్టార్ ను మాస్ హీరో గా చూపించి హిట్ కొట్టి మంచి ఉపుమీదున్న బోయపాటికి పెద్ద చ్చిక్కే వచ్చింది.

అల్లుడు శ్రీను సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తానని, భారీ పారితోషికానికి ఆశపడి బోయపాటి శ్రీను చేసిన చిన్న సంతకం, ఇప్పుడు అతని కెరీర్ తో ఆట ఆడుకుంటోంది. సరైనోడు సినిమా చేయటానికే చాల కష్టపడాల్సివచ్చింది. లక్కీగా అప్పట్లో బెల్లంకొండ సురేష్ కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో వుండడంతో సరైనోడు సినిమా చేయటానికి వీలుకుదిరింది.

కానీ ఇప్పుడు తన కొడుకు సినిమా చేసి తీరాల్సిందే నని బెల్లంకొండ పట్టుపట్టడంతో ఇప్పుడు తప్పేటట్టు లేదు. అయితే  బెల్లంకొండ సినిమా చేయటానికి బోయపాటిదగ్గర సరైన కథ రెడీగా లేదు అనేది వాస్తవం. దానికోసమే ఇప్పుడు బోయపాటి కుస్తీ పడుతున్నాడు.

వరుస హిట్స్ కొట్టిన బోయపాటి ఇప్పుడు పెద్ద హీరోస్ తో సినిమా చేసే ఛాన్స్ మిస్సయిపోయాడనే చెప్పాలి. ఈ కోవలోనే బాలకృష్ణ 100 వ. సినిమాని కూడా మిస్సయ్యాడు. ఇప్పుడు జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ కూడా బోయపాటి వైపు చూసినా ఏమిచేయలేని పరిస్థితిలో వున్నాడు. ఇప్పటికీ బెల్లంకొండ సినిమా స్టార్టింగ్ స్టేజి లోనే ఉండటం తో ఇక బోయపాటి పెద్ద హీరోతో భారీ సినిమా ఇప్పట్లో చేసే అవకాశం లేదు.