జనతా గ్యారేజ్ పై వెంకటేష్ కామెంట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల సూపర్ కాంబినేషన లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్. ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్తో రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సీనియర్ హీరో వెంకటేష్ కూడా చేరిపోయారు.

హీరో వెంకటేష్ ఇటీవల బాబు బంగారం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నారు , ప్రస్తుతం రీమేక్గా రూపొందుతున్న గురు సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా కోసం కండలు పెంచే పనిలో ఉన్నాడు వెంకీ. ఇటీవల జనతా గ్యారేజ్ సినిమా చూసిన వెకటేష్, జనతా గ్యారేజ్ యూనిట్ సభ్యులను అభినందించారు. ‘జనతా గ్యారేజ్ సినిమా చూశాను. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఎన్టీఆర్, మోహన్ లాల్ నటన అద్భుతంగా ఉంది. యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు’ అంటూ కామెంట్ చేశారు. సీనియర్ హీరో అయిన వెంకటేష్ ఇలాంటి కామెంట్ చేయటంతో ఎన్టీఆర్ ఖుషీ అయ్యాడు.

venkatesh-janatha-garge