జయకు శశికళకు మధ్య తోపులాట … అసలు ఏమి జరిగింది ?

త‌మిళనాట రాజకీయాలు ఊహించ‌ని మ‌లుపుల‌తో థిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తున్నాయి! అధికారం కోసం జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరులో.. ఎన్నో ట్విస్ట్‌లు న‌మోద‌వుతున్నాయి! ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలతో జ‌య నెచ్చెలి శ‌శిక‌ళపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తీవ్ర‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో శ‌శిక‌ళ‌పై అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌య ఆసుప‌త్రిలో చేరిన రోజు రాత్రి ఏమ‌యిందో బ‌ట్ట‌బ‌య‌లు చేశారు! సెప్టెంబ‌రు 22న పోయెస్ గార్డెన్‌లో శశిక‌ళ‌కు, జ‌య‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింద‌ని, అందులోనే జ‌య‌ను శ‌శిక‌ళ తోసేయ‌డంతోనే ఆమె తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని సంచ‌ల‌న  వ్యాఖ్య‌లు చేశారు!!

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలిత అస్వస్థతకు గురైన సెప్టెంబరు 22 రాత్రి పోయె్‌సగార్డెనలో జరిగిన సంఘటనలపై సమగ్ర విచారణ జరపాలని తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పాండ్యన డిమాండ్‌ చేశారు. మంగళవారం పాండ్యన్‌ తన కుమారుడు, మాజీ ఎంపీ మనోజ్‌ పాండ్యన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సెప్టెంబరు 22న అపోలోలో చేరడానికి ముందు పోయెస్‌ గార్డెనలో జయకు శశికళకు మధ్య తోపులాట జరిగిందని, ఈ ఘటనలో జయను శశికళ తోసేయడంతో జయ కుప్పకూలిపోయారని పాండ్యన్‌ ఆరోపించారు.

తనను పైకి లేపాల‌ని జయ కేకలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తీవ్రంగా గాయపడిన జయకు ఏమైనా జరిగితే జనం తనను తప్పుపడతారనే భయంతో శశికళ ఆమెను ఆసుపత్రికి తరలించారన్నారు. 75 రోజులపాటు జయకు ఎలాంటి చికిత్సలు జరిగాయో ఎవరికీ తెలియవన్నారు. ఆమె మృతి చెందినప్పుడు తాను ఆసుపత్రి వద్దే ఉన్నానని, ఆ సమయంలో శశికళ కంట నీటి చుక్కరాలేదన్నారు. జయ మృతదేహాన్ని చూసేందుకు తాను ప్రయత్నించినా అడ్డుకున్నారన్నారు. అన్నాడీఎంకే పార్టీలో ప్రధాన కార్యదర్శిని సభ్యులంతా ఓటు వేసి ఎన్నుకోవాల్సి ఉండగా శశికళ ఆ పద్ధతికి స్వస్తి చెప్పి ఎంపికయ్యారని సీఎంగా పదవిని చేపట్టడానికి ఆమె అనర్హురాలని విమర్శించారు.

అన్నాడీఎంకే మాజీ ఎంపీ మనోజ్‌ పాండ్యన మాట్లాడుతూ… తాను పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జయ తరచూ తనతో శశికళ కుటుంబీకులు తనను విషమిచ్చి చంపుతారేమోనని ఆందోళన వ్యక్తం చేసేవారని చెప్పారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేందుకు ఓ గుంపు ప్రయత్నిస్తోందని, ఎట్టి పరిస్థితులలోను శశికళను రాజకీయాల్లో అడుగుపెట్టనివ్వనని కూడా చెప్పారని పేర్కొన్నారు.