టీడీపీ ఎవరికోసం?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక హోదా విషయం పై రగిలిపోతుంటే అధికార టీడీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ సంబంధించిన అతి పెద్ద సమస్య ప్రత్యేకహోదా అంశం ఇప్పుడు జరుగుతున్న శాసనసభలో దానికి మించిన సమస్య ఇంకేమిలేదు అయితే దానిగురించి చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే ఎందుకు అధికార టీడీపీ జరిపించటం లేదు? ప్రత్యేకహోదాకంటే పెద్ద సమస్య ఇంకేమైనా ఉందా? ప్రత్యేక హోదా ఎమన్నా ప్రతిపక్ష పార్టీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత సమశ్యా ?.

అయినా ప్రత్యేక హోదా సాధిస్తే దానివల్ల అధికార టీడీపీ నే ఉపయోగం పొందుతుంది. అసలు రాష్ట్రం తరుపున పోరాడాల్సిన భాద్యత టీడీపీ పైనే ఎక్కువగా వుంది ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించారుగనుక. అయినా ఒకసమస్యపై అధికారపార్టీ పోరాడుతానంటే ప్రతిపక్షం మద్దతు ఇవ్వటానికి రెడీగా వున్నా దానిని ఉపయోగించుకుని పోరాడకపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం.

అయినా ప్రతిసారి కేంద్రంతో పోరాడకూడదు, వారికి అనుకూలంగానే ఉండి సాధించుకోవాలి అంటుంటారు అసలు మనమేమయిన కొరకుడని లేక కేంద్రప్రభుత్వం చేతిలో లేని పనులేమయిన చేయమని కోరుతున్నామా? లేదుకదా వాళ్ళు హామీ ఇచ్చిన దానినే కదా అమలుపరచమని కోరేది. మనహక్కును మనం సాధించుకోలేనప్పుడు ఇంకా ప్రాంతీయ పార్టీలతో పనేముంది? కేంద్రం తో పోరాడలేనప్పుడు ఇంకా మీరెందుకు. జాతీయపార్టీనే రాష్ట్రంలోకూడా అధికారంలోకి తెచ్చుకుంటే సరిపోతుంది కదా!. అసలు తెలుగు దేశం పార్టీ పుట్టుకతోనే తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ కు ఒక గౌరవం ఏర్పడిందనేది అందరూ ఒప్పుకునే విషయం అలాంటిది ఈ రోజు ఆ పార్టీ విధానం వల్లనే తెలుగు ప్రజల గౌరవం పోతుంది.

ప్రతివిషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నా అనిచెప్పే చంద్రబాబు ప్రత్యేక హోదాపైన కూడా ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ప్రత్యేక విషయం పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు,ప్రతిపక్షం,మీడియా అన్ని అనుకూలంగా వున్నా అధికారపార్టీలో అనుకూలత కనిపించటంలేదు. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఇదే విధానం అవలంభిస్తే కచ్చితంగా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన పరిస్థితే ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తుంది.