తెలంగాణ దెబ్బకు జ్యోతుల,భూమా కుదేల్

సిగ్గుమాలిన నీచ రాజకీయాలు పరాకాష్టకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేరిన తరుణం ఇది.నిస్సిగ్గుగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే చందాగా,ఒక పార్టీ గుర్తు పై గెలిచి అధికార వాంఛతో,ధనార్జనే ధ్యేయంగా,అవినీతి బండారాల్ని కప్పి పుచ్చుకోవడానికి మన రాజకీయ నాయకులు చేస్తున్న నవతరం వ్యభిచార రాజకీయాలే ఈ పార్టీ ఫిరాయింపులు.ఈ రాజకీయవ్యభిచారం అభివృద్ధి అన్న ముసుగేసుకుని మరీ చేసేస్తున్నారు.సిగ్గు కే సిగ్గేస్తుందేమో వీళ్ళని చూస్తే.

తాజాగా ఈ ఫిరాయింపు వీరులని ఇంకో మెట్టు ఎక్కించే ప్రయత్నాల్లో ఆంధ్ర చండ్రుడు అడుగులేస్తున్నట్టు సమాచారం.అందులో భాగంగానే కర్నూల్ జిల్లా నుండి భూమా నాగి రెడ్డి కి తూర్పు నుండి జ్యోతుల నెహ్రు కి మంత్రి వర్గ విస్తరణలో చోటు ఖాయం అన్న ఊహాగానాలు వినిపించాయి.దీనికి చంద్రబాబు కుల,ప్రాంత,వర్గ విశ్లేషణలు వేసి కాచి వడపోసి మరీ ఈ వీర విదేయుల్ని ఎంపిక చేశారు.

అక్కడే బాబుగారికి అసలు చిక్కొచ్చింది.మొన్నీ మధ్యనే తెలంగాణా లో టీటీడీపీ ని తెరాస లో విలీనం చేస్తూ స్పీకర్ తీర్మానాన్ని ఆమోదించడాన్ని హై కోర్ట్ తప్పు పట్టింది.స్పీకర్ కి నోటీసులు కూడా ఇవ్వడం తెలిసిందే.ఇక్కడే చంద్రబాబు గొంతులో వెలక్కాయ పడింది.ఇప్పుడు మనం కూడా ఫిరాయించిన వారికి పదవులిస్తే ఈ మొత్తం వ్యవాహారం కోర్ట్ మెట్లెక్కి ఎటెల్లి ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని ఆవేదనతో ఉన్నారట బాబుగారు.అయినా అది తెలంగాణ కదా బాబూ అందులోనా నష్టపోయింది టీడీపీ కదా అక్కడ అందుకే కోర్ట్ తీర్పు అలా వుంది.అదే నీ దాకా వస్తే తీర్పు అలా ఉంటుందా ఏంటి..ఎవరికీ తెలీయని బాగోతం ఇది.

ఇక తెలంగాణాలో కెసిఆర్ వైఖరిని,టీడీపీ పార్టీ కి జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ కి గతం లో పదే పదే చెప్పి కన్నీరు మున్నీరైనంత పని చేసిన చంద్రన్న తాజాగా అదే గవర్నర్ ని మంత్రి వర్గ విస్తరణకు ఆహ్వానించాడు.అయితే గవర్నర్ కి తెలియని చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతలా.. అవకాశవాద రాజకీయాలా.. అందుకే క్షణం ఆలస్యం చేయకుండా తెలంగాణాలో నువ్వే ఫిర్యాదు చేస్తావు.. ఆంధ్రలో నువ్వే ఆ నీతి మాలిన పని నాచేత రిబ్బన్ కటింగ్ చేయమంటావు అనడం తో బిక్కమొహం వేయడం తప్ప బాబుకు వేరే దారి లేకపోయింది పాపం.