దేవాలయాలు కూడానా కెసిఆర్ గారూ

కెసిఆర్ లోని ఉద్యమనేత ఇంకా చల్లారినట్లు లేడు.అయన ఇప్పుడో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అప్పుడప్పుడు నేనింకా ఉద్యమనేతనే అని అందరికి గుర్తు చేస్తుంటారు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్.ఉద్యమనేతగా చాలా కలం కొనసాగి ఆ అలవాట్లు ఇంకా పోలేదో లేక నేను ముఖ్యమంత్రినైనా నాలో ఉద్యమ నాయకుడే ఎప్పుడు ముందుంటాడని చుపించాడానికో తెలీదు.

రాష్ట్ర ముఖ్యమంత్రే ఏకంగా బంద్ కి పిలుపునివ్వడం ఎక్కడైనా చూశామా.అది కేవలం కెసిఆర్ కె సాధ్యం.ఖమ్మం జిల్లా లోని 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో కలిపినందుకు నిరసనగా స్వయానా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చారు.ఇదొక్కటే కాదు ముక్యమంత్రయ్యాక కూడా కెసిఆర్ అటు ప్రతిపక్షాల్ని ఇటు ఆంధ్ర పాలకుల్ని ఉద్యమనేత దృష్టిలోనే చూస్తూ అవే విమర్శలు పదే పదే చేయడం గమనార్హం.

తాజాగా తెలంగాణా దేవాలయాలకు కూడా ఆంధ్ర పాలకులు అన్యాయం చేసారంటూ కెసిఆర్ ధ్వజమెత్తాడు.నీళ్లు..నిధులు అన్నారు ఓకే కానీ పనిగట్టుకొని తెలంగాణా లోని దేవాలయాలను వాటి విశిష్టతను ఆంధ్ర పాలకులు కనుమరుగు చేశారని ముఖ్యమంత్రి స్థాయిలో కెసిఆర్ విమర్శించడం తగదు.ఉద్యమ వేడిలో ఆ విమరసాలు పర్లేదు గాని అనాలోచితంగా విమర్శలు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కెసిఆర్ కి తగవు.

పుష్కరాలకు సైతం అప్పట్లో అన్యాయం జరిగిందని తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సరిదిద్దుతోందన్నారు.ఇలా ఒకటేమిటి ఎక్కడికెళ్తే అక్కడ ఓ వైపు వరాల జల్లు ఇంకోవైపు ఆంధ్ర పాలన పై విమర్శలు ఇదీ కెసిఆర్ తంతు.ఛాన్స్ దొరకలేదు కానీ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు ఉద్యమం కూడా ఆంధ్ర పాలకుల వల్లనే అనేవారు కెసిఆర్.అసలు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఆంధ్ర పాలనలో జరిగిన అన్యాయం మూలంగానే చేపట్టాం..ఈ రైతుల తిరుగుబాటు వెనుక కూడా ఆంధ్ర శక్తులున్నాయి అని కూడా వినాల్సొస్తుందేమో భవిష్యత్ లో.

నీళ్లు..నిధులు..నియామకాలు..అన్యాయం జరిగిందని నిందించు..అంకెలతో సహా ఒప్పుకుంది యావత్ తెలుగు జాతి..అదొక పద్ధతి.అంతే కానీ అయినా దానికి కానీ దానికి ఇంకా ఉద్యమనేతగానే విద్వేషాలు రగిల్చేలా మాట్లాడడం రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పరిణామం కాదు.