పన్నీర్ వెంట టీడీపీ.. శశికళ వెంట వైకాపా!

త‌మిళ‌నాడు రాజకీయాల్లో సీఎం సీటు కేంద్రంగా రెండు రోజులుగా జ‌రుగుతున్న వివాదం దేశం మొత్తాన్ని ఆక‌ర్షించింది. పురుట్చిత‌లైవి, అమ్మ జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన త‌మిళ‌నాడు సీఎం సీటును ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా అమ్మ‌కు అత్యంత విధేయుడు, ఆద‌ర్శ‌ప్రాయుడు అయిన ప‌న్నీర్ సెల్వం త‌మిళ‌నాడుసీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే, ఈ సీటుపై క‌న్నేసిన శ‌శిక‌ళ‌.. ప‌న్నీర్‌తో రాజీనామా చేయించి అన్నాడీఎంకు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అంతేకాదు, రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు త‌న‌కు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించుకున్నారు.

ఈ విష‌యంపై ప‌న్నీర్ ఫైర‌య్యారు. అమ్మ ఆత్మ సాక్షిగా నిజాలు చెబుతానంటూ మెరీనా బీచ్‌లో చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత సంచ‌ల‌న సృష్టించాయి. ఈ క్ర‌మంలో ఇరు నాయ‌కుల నేతృతంలో సీఎం సీటు పోరు ఉధ్రుతంగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీలో ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌పై వేడి రాజుకుంది. నిజానికి ఎమ్మెల్యేలంద‌రూ శ‌శిక‌ళ ప‌క్షానే ఉన్నారు కాబ‌ట్ గ‌వ‌ర్న‌ర్ శ‌శిక‌ళ‌కే ప్రాధాన్యం ఇవ్వాల‌ని వైకాపా వాదిస్తోంది.

అయితే, టీడీపీ మాత్రం ప‌న్నీర్ సెల్వానికే ఓటే స్తోంది. ప్ర‌జా మ‌ద్ద‌తు స‌హా పాల‌నానుభ‌వం ఉంద‌ని, జ‌య‌ల‌లిత గ‌తంలో ఈయ‌న‌నే రెండు సార్లు సీఎంగా నియ‌మించింద‌ని పార్టీ గుర్తు చేస్తోంది. ఒక ప‌క్క వైకాపా, మ‌రోప‌క్క టీడీపీ నేత‌లు సైతం త‌మ త‌మ సోష‌ల్ మాడియాల్లో శ‌శిక‌ళ‌, ప‌న్నీర్‌ల‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.