పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాకోసం ఏం చేస్తాడు?

లడ్డు కావాలా నాయనా..ఎం నాయనా ఇంకో లడ్డు కావాలా..అంటూ కాస్త కొంటెగా ..ఇంకాస్త ఆవేశంగా..అన్నిటికి మించి అగమ్య గోచరంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ లో ప్రజాసంగించారు.తిరుపతి సభతోనే పవన్ పబ్లిక్ ప్రసంగాలపై సామాన్యులకి ఒక అంచనా వచ్చేసింది.ఇక కాకినాడ సభ లో పవన్ నుండి పెద్దగా ఎవ్వరూ ఏమి ఆశించింది లేదు అయితే గత రెండు మూడు రోజులుగా ప్రత్యేక హోదా పైన కేంద్ర చెప్తున్నా వక్ర భాష్యం దానికి చంద్రబాబు పాడుతున్న వంకర వత్తాసు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వీటన్నింటిపై ఎలా స్పందిస్తున్నారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పవన్ మొత్తం ప్రసంగం చూస్తే అసలు పవన్ ఎజండా ఏంటో మనకు అర్థం కాదు.ఎంతో ఆవేశంగా ఒక విషయాన్ని మొదలు పెట్టి అంతకంటే అనాలోచితంగా దాన్ని నీరుగార్చేసాడు పవన్ ప్రసంగం అంతా.అసలు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశమేంటా అనే ప్రశ్న పవన్ ప్రసంగం తరువాత ప్రతి ఒక్కరికీ కలగక మానదు.అసలు ఈ సభ ప్రత్యేక హోదా కోసమా లేక తెలుగు జాతి చరిత్ర పాఠాల నెమరువేసుకోవడానికో అర్థం కాదు.అసలు ఈ సభ తెలంగాణా వాళ్ళకోసమా..లేక ఆంధ్రప్రదేశ్ కోసమో అర్థం కాదు..తెలంగాణా వాళ్ళు నష్టపోయారు అంటాడు..రాష్ట్ర విభజనతో మనల్ని మెడబట్టి గెంటేశాడంటాడు..తెలంగాణా పాటలు పడుతాడు..వాళ్ళ బాధలు బలిదానాలు తెలుసంటాడు..సమైక్యాధ్ర,జై ఆంధ్ర ఉద్యమాలు అంటాడు.ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు పవన్ కైనా అర్థమయిందో లేదో.

ఈ మధ్య కాలం లో పవన్ ని విమర్శించిన టీజీ వెంకటేష్,అవంతి శ్రీనివాస్ లాంటి వారిని గుర్తు పెట్టుకుని మరీ వాళ్లపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసాడు పవన్.అయితే ప్రత్యేక హోదా ఊసే ఈ సభ మొత్తం ఎక్కడా పెద్దగా కనిపించదు..ఎదో ఓ 2-3 సందర్భాల్లో ప్రత్యేక హోదా అంటూ మొదలెట్టినా అది గతి తప్పి ఎక్కడో ముగిసిపోయింది.కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ని లడ్డులతో పోలుస్తూ ఆ పాచిపోయిన లడ్డులు తీసుకోవాలో వద్దో టీడీపీ నిర్ణయించుకోవాలి అనడం మినహా ప్రత్యేక హోదాపైన పవన్ ఎవర్ని పెద్దగా ప్రశ్నించింది లేదు.

వెంకయ్య నాయుడు గారు మీరు నన్ను క్షమించాలి..మీ ఫామిలీ నన్ను క్షమించాలి..రాష్ట్ర ప్రభుత్వం పైనా ఇప్పటికీ తనకెంతో గౌరవం ఉందనీ..అది తగ్గలేదని..ఇలా ఎవ్వరినీ నొప్పించక తానొప్పక అన్న రీతిలో ప్రసంగం ముగించాడు.పక్కన వాళ్ళు చేస్తే గులాం గిరీ అని విమర్శించే పవన్ చేస్తున్నదేంటో ఎవ్వరికీ అంతుపట్టదు.ఎక్కడా ఒక ప్రణాళిక ప్రకారం ఎవ్వరినీ నిలదీసిన పాపాన పోలేదు..ఎంత సేపు అన్యాయం..భాధ,యువత, మధ్య తరగతి అనే తప్ప దానికోసం పవన్ ఏమి చేస్తాడు..జన సేన ఏం చేయబోతోందన్న ఊసే లేదు.

కేంద్ర ప్రత్యేక హోదా ఇవ్వము అంటూ కంటితుడుపు సాయాలు ప్రకటించిన నేపథ్యం లో పవన్ కార్యాచరణ్ కోసం సర్వత్రా ఎదురుచూసిన నేపథ్యం లో పవన్ ఆ అవకాశాన్ని నీరుగార్చేసాడు.ఇంకా కేంద్రాన్ని వెంకయ్యని ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అని తేల్చి చెప్పండి అనడం పవన్ అవివేకానికి నిదర్శనం.పవన్ అసలు గత రెండ్రోజులు జరిగిన పరిణామాలు ఫాలో అయ్యాడా లేదా అనే అనుమానం కలగక మానదు. సరిగ్గా ఇటువంటి సమయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ అల్టిమేటం జారీ చేసి ఒక డెడ్ లైన్ విధించి ప్రత్యేక హోదా ఇస్తారా చస్తారా అంటూ ఆవేశం ప్రదర్శించి ఉంటే వ్యవహారం వేరేలా ఉండేది.అదేమీ లేకుండా అర్థం లేని ఆవేశం..అనాలోచిత ప్రసంగం తో అంది వచ్చిన అవకాశాన్ని పవన్ నీరు గార్చేసాడు.

మొన్న తిరుపతి సభలో కనీసం భవిషత్ కార్యాచరణ అయినా ప్రకటించాడు పవన్..ఫలానా రోజున కాకినాడలో సభ అని..తరువాత కలెక్టరేట్ల ముట్టడనీ..ఇలా కనీస కార్యాచరణ ప్రకటించాడు.అయితే ఈ కాకినాడ సభలో అదేం లేదు..లడ్డులు..పాటలు..పంచ్ లతో పవన్ పూర్తి చేసేసాడు.మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎన్నాళ్లకు పవన్ బయటొస్తాడో ఎవ్వరికి మాత్రం తెలుసు.