పవన్ చెంతకు జేపీ … ఫలించిన పవన్ ప్లాన్

లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌లోకి ఎంట్రీ ఇస్తున్నారా ?  ఇప్ప‌టికే ప‌వన్‌-జేపీ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయా ?  జేపీ 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి ఎంపీగా కూడా పోటీ చేస్తారా ? అంటే జ‌నసేన వ‌ర్గాల ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది. సేవా సంస్థ‌గా ప్రారంభ‌మైన లోక్‌స‌త్తా త‌ర్వాత రాజ‌కీయంగా మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది.

2009 ఎన్నిక‌ల్లో జేపీ కూక‌ట్‌ప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా గెల‌వ‌డం మిన‌హా ఆ పార్టీ రాజ‌కీయంగా సాధించింది ఏమీ లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జేపీ మ‌ల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. త‌ర్వాత రాజ‌కీయంగా లోక్‌స‌త్తా క‌నుమ‌రుగైంది. ప్ర‌స్తుత‌ రాజ‌కీయ ప‌రిస్థితులు ఆ పార్టీకి వ‌ర్కవుట్ కాలేదు. లోక్‌స‌త్తా రాజ‌కీయంగా ప్లాప్ అయినా జేపీ సిద్ధాంతాలు స‌మాజానికి ఏదో చేయాల‌న్న కాన్సెఫ్ట్‌కు ద‌గ్గ‌రిగా ఉంటాయి. ఇదే ఆలోచ‌న‌లు మెండుగా ఉన్న ప‌వ‌న్‌-జేపీ ద‌గ్గ‌ర‌వుతున్నార‌ని తెలుస్తోంది. జ‌న‌సేన సిద్ధాంత‌క‌ర్త‌ల్లో ఒక‌రిగా జేపీని ప‌వ‌న్ నియ‌మిస్తార‌ని కూడా తెలుస్తోంది.

ఇక జేపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఆలోచ‌న‌తో లేక‌పోయినా ఆయ‌న్ను ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే బ‌రిలో దింపుతార‌ని తెలుస్తోంది. ఆయ‌న్ను లోక్‌స‌భ‌కు పంపాల‌నుకుంటే ఉత్త‌రాంధ్ర‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన విశాఖ‌ప‌ట్నం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తార‌ని కూడా మ‌రో టాక్ న‌డుస్తోంది.

ఎన్నిక‌ల్లో జేపీ అస్స‌లు బ‌రిలోకి దిగేందుకు ఇష్ట‌ప‌క‌డ‌పోతే ఆయ‌న్ను ఎన్నిక‌ల త‌ర్వాత ఎమ్మెల్సీ చేసి మండ‌లికి అయినా పంపేందుకు ప‌వ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. జేపీ లాంటి మేథావి త‌న పార్టీలో ఉంటే పార్టీకి స‌రైన ద‌శ నిర్దేశం ఉంటాయ‌న్న‌దే ప‌వ‌న్ ప్లాన్‌గా తెలుస్తోంది. జేపీ ప‌వ‌న్ జ‌న‌సేన‌లోకి ఎంట్రీ ఇస్తే ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా పెద్ద మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్టేనంటున్నారు విశ్లేష‌కులు.