ప్రత్యేక హోదానా వంకాయా:జైట్లీ

ప్రత్యేక హోదాపై అధికార పక్షం చాలా క్లారిటీగా వుంది.చెవిటోడి ముందు శంఖం ఊదిన ప్రయోజం ఉంటుందో లేదో కానీ ఇంత క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ వేదన అరణ్య రోదనే..నిన్న బొంకయ్య నాయుడుగారు బొంకిన బొంకులే ఈ రోజు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు కూడా ఇంకొంచెం పోలిష్ చేసి వల్లెవేశారు.

అసలు చర్చే ప్రత్యేక హోదా గురించి అయితే ఎంతసేపు దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ధి గాని,ప్రత్యేక హోదా అమలు చేసే ఆలోచన కానీ కేంద్రానికి లేదన్నది స్పష్టమయింది.ఏపీ కి IIT ,NIIT ,AIIMS ఇలా ఇచ్చిన వాటిమీద ఏకరువు పెట్టారు.అంతేనా విశాఖ రైల్వే జోన్,పోలవరం ప్రాజెక్ట్ మీద కూడా సవతి ప్రేమని ఒలకబోశాడు జైట్లిగారు.

ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్రం సహాయం చేస్తుంది.విభజన వల్ల ఏపీ ఆదాయాన్ని కోల్పోయింది..అభివృద్ధి చెందేంతవరకు ఏపీ కి అండగా ఉంటాం..13va షెడ్యూల్ లో ఉన్న అంశాలన్నిటినీ అమలు చేస్తాం..జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరాన్ని పూర్తి చేస్తాం..రాజధాని నిర్మాణానికి 2050 కోట్లిచ్చామ్..వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంటుంది..ఇలా చెప్పిన సోదే మళ్ళీ చెప్పి అసలు విషయాన్ని మాత్రం సైడ్ చేశారు.అయినా పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీని,ప్రతిపక్షం బలపరిచిన హామీ అయిన ప్రత్యేక హోదాని అమలు చేయని వీళ్లా ఈ కొత్త హామీలని అమలు చేసేది..

కేంద్రం ఆదాయం లో రాష్ట్రాలకు 42% వాటా ఇస్తోంది..అన్నీ రాష్ట్రాలను ఆర్థికంగా సంతృప్తి పరచడం సాధ్యం కాదు.అప్పట్లో కొత్తగా ఏర్పడిన త్రీ రాష్ట్రాల్లో ఒక్క ఉత్తరాఖండ్ కె ప్రత్యేకహోదా ఇచ్చాము అది కూడా భౌగోళిక పరిస్థితుల్ని బట్టే ఇచ్చారని గుర్తుచేశారు.ఇక్కడ మేటర్ సింపుల్ ..మేము ప్రత్యేక హోదా ఇవ్వము..ఇచ్చే ఉద్దేశం కూడా లేదు ..ఇలాగే డొంకతిరుగుడు సమాధానాలు చెప్తుంటాము..ఆంధ్రప్రదేశ్ లో అధికారం లో ఉన్నా టీడీపీ పార్టీ కె లేని బాధ మాకెందుకు.మేమింతే.

చాలా క్లియర్ గా క్లారిటీగా అధికార బీజేపీ ప్రత్యేక హోదా విషయం లో తెలుగుదేశం పార్టీ తో కలిసి నయవంచన చేస్తోంది.రెండు విషయాలు..ఒకటి మేము ఇప్పటికే చాలా చేసాము..ఇక ముందు కూడా చేస్తాం..రెండోది..14th ఫైనాన్స్ కమిషన్,నీతి ఆయోగ్,CRD ఇలా రకరకాల పేర్లు వాడి వాటితో సమస్యలున్నాయి వాటిని సాల్వ్ చేయాల్సిన అవసరం వుంది.ఇది బీజేపీ మాట..ఇంకా అర్థం కాకుంటే మనకంటే పిచ్చి వాళ్ళు వేరొకరుండరు..