ప్రేమమ్ TJ రివ్యూ

సినిమా : ప్రేమమ్
రేటింగ్ : 3.25/5
టాగ్ లైన్ : ట్రాజెడీ లేని నా ఆటోగ్రాఫ్

నటీనటులు: చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి, ప్రవీణ్, చైతన్యకృష్ణ.
సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్
పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని
చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని:
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు;
ఆర్ట్: సాహి సురేష్;
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి

నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తూ మొదలయ్యే ప్రేమమ్ నాగచైతన్య రియల్ లైఫ్ కి నాగార్జున ఇచ్చే వాయిస్ ఓవర్ ని అడాప్ట్ చేసుకుని బాగానే కనెక్ట్ అవుతారు ప్రేక్షకులు సినిమాకి .పిల్లలు.. ప్రేమ.. ప్రేమే జీవితం.. పిల్లలకు ప్రేమే ప్రపంచం అంటూ నాగ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండడం ఫస్ట్ ఫ్రేమ్ నుండే ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు.సింపుల్ గా చెప్పాలంటే అప్పుడెప్పుడో వచ్చిన రవితేజ నా ఆటోగ్రాఫ్ సినిమాకి అడ్వాన్స్ అండ్ లేటెస్ట్ వెర్షన్ సినిమాయే ఈ ప్రేమమ్.

కార్తికేయ లాంటి ప్రయోగాత్మక సినిమాతో శభాష్ అనిపించుకుని మంచి హిట్ కొట్టిన చందు మొండేటి మలయాళం లో బ్లాక్బస్టర్ అయిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమమ్ ని అదే పేరుతో నాగచైతన్య తో రీమేక్ చేయడం ఒకరకంగా చైతన్య కి చందుకి ఇద్దరికీ కూడా సేఫ్ గేమ్ అనే చెప్పొచ్చు.ఇద్దరూ ఒకరిమీద ఒకరు కాంఫిడెన్స్ తో పని చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.ముక్యంగా కథను ఇద్దరూ బాగా నమ్మి ఒకే వేవ్ లెంగ్త్ లో ట్రావెల్ చేసి తీశారు ప్రేమమ్ ని.ముక్యంగా చందు దర్శకుడిగా నాగచైతన్యని ప్రెజెంట్ చేసిన తీరు మెచ్చుకోవాల్సిందే.

ఈ సినిమా చూడగానే మనకి గుర్తొచ్చేది నా ఆటోగ్రాఫ్.అయితే దానికీ ప్రేమమ్ కి ఉన్న ఒకే ఒక్క తేడా ట్రాజిడీ.నా ఆటోగ్రాఫ్ సినిమాలో ప్రతి ఒక్కరితో రిలేషన్ డెప్త్ గా ఉంటూ సినిమాలో ట్రాజెడీ మోతాదు ఎక్కువగా ఉంటే ప్రేమమ్ లో మాత్రం సినిమా మొత్తం ఎక్కడా ట్రాజిడీ షేడ్స్ కనపడకుండా కొంచెం లైట్ గా ఇంకొంచెం సరదాగా ప్రేమమ్ నడిచిపోవడం సినిమాకి అతిపెద్ద అస్సెట్.

ఓ కుర్రాడి స్కూల్,కాలేజ్,కెరీర్ అనే మూడు స్టేజి లలో కలిగిన ప్రేమ ఎలాంటి అనుభూతు,జ్ఞాపకాల్ని మిగిల్చింది అన్నదే ఈ ప్రేమమ్ స్టోరీ లైన్.ప్రేమలో గెలవడం ఓడిపోవడం అనేది ఉండదు.ఎందుకంటే ప్రేమించిన మనుషులు దూరమవచ్చేమో కానీ వాళ్ళ జ్ఞాపకాలు ప్రేమగా మనతోనే ఎప్పటికీ ఉంటాయి అన్నదే అంతర్లీనంగా సినిమా మొత్తం నడిచే కథనం.మళయాళ మాతృకకి పెద్దగా మార్పులు చేర్పులు చేసే సాహసం చందు చేయకపోవడం మెచ్చుకోవాలి. కథ,కథనం, స్క్రీన్ప్లే గురించి ఎంత చెప్పినా తక్కువే.కాకపోతే మళయాళ నేటివిటీకి మనకి కొంచెం సినిమా సాగదీసినట్టు అనిపించడం మినహా సినిమా మొత్తం గ్రిప్పింగ్ గానే నడిపించాడు దర్శకుడు చందు మొండేటి.

పర్సనల్ లైఫ్ లో ప్రేమలో పీక్స్ లో ఉన్న నాగ చైతన్య నటుడిగా ప్రేమమ్ తో మరో మెట్టేక్కేసాడు.ఈ సినిమా తరువాత ఎవ్వరికైనా ప్రేమ కథలకి హీరో అనగానే ముందుగా నాగ చైతన్య నే గుర్తొస్తాడు.అంతగా ఇంపాక్ట్ చేస్తాడు చైతు.స్కూల్ కుర్రాడిగా ఇమ్మెచ్యూర్డ్ గా ఎంతో మెట్యూర్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు చైతు.ఇక కాలేజీ కుర్రాడిగా ఆ చేంజ్ ఓవర్ సీన్ అయితే హైలైట్.ఎంతో రఫ్ గా గడ్డం, పొడవు జుట్టు,సిగరెట్ వెలిగిస్తూ బ్యాక్ గ్రౌడ్ లో ట్రాన్స్ఫార్మర్ పేలే సీన్ సూపర్బ్.ఇక లైఫ్ లో సెటిల్ అయి ప్రొఫషనల్ కుక్ గా కూడా చైతు మెప్పించాడు.ఇలా మూడు పాత్రల్లో ఆ చేంజ్ ఓవర్ గెటప్, ఆ పెర్ఫార్మన్స్ వేరియేషన్స్ చైతూని నిజంగా నటుడిగా ఇంకొక మెట్టెక్కించింది ప్రేమమ్.

ఇక ముగ్గురు హీరోయిన్స్ కథకి బాగా సెట్ అయ్యారు.అనుపమ పరమేశ్వరన్,శృతి హాసన్,మడోనా సెబాస్టియన్ ముగ్గురు పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకున్నారు.శృతి ఒక్కటే కొత్తగా చేసింది మిగతా ఇద్దరూ మలయాళం లో కూడా అవే పాత్రల్లో నటించారు.మిగతా వాళ్లలో ప్రవీణ్,శ్రీనివాస రెడ్డి ల కామెడీ బాగా పండింది.గెస్ట్ రోల్ లో వెంకటేష్ నాగార్జునలు మెరిపించారు.పాటలు సిట్యుయేషనల్ గా బాగున్నాయి,బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.ఎడిటింగ్ ,సినిమాటోగ్రఫీ కథ మూడ్ ని క్యారీ చేశాయి.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలు అనగానే పెద్ద పెద్ద బోరింగ్ సీన్స్,ట్రాజెడీ సీన్స్ తో నిండిపోయుంటాయనుకుంటే పొరపాటని ప్రేమమ్ చెప్తోంది.మంచి హ్యూమర్,ఫన్ జత చేసి కూడా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలుంటాయని ప్రేమమ్ ప్రూవ్ చేసింది.ఓవర్ అల్ గా సినిమా కొంచెం ల్యాగ్ అయినా అది కనపడనీయకుండా నడిచిపోతుంది ప్రేమమ్.