ఫాన్స్ కి తేల్చి చెప్పిన చరణ్

మెగాస్టార్ చాలా విరామం తరువాత నటిస్తున్న 150 వ. సినిమా ‘ఖైదీ నంబర్‌ 150’.ఫాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఈ సినిమా కి ముందుగా చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ ఫైనల్ గా ‘ఖైదీ నంబర్‌ 150’ ని కంఫర్మ్ చేసాడు రామ్ చరణ్ దీనికి ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టారు.దీన్ని చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి ఫిక్స్‌ చేశారట.

అయితే ఇప్పుడు ఆ టైటిల్ గురించి మెగా అభిమానుల్లో పెద్ద చర్చే జరుగుతుంది. ‘ఖైదీ నంబర్‌ 150’ అనే టైటిల్ పెద్దగా ఎక్కేటట్టు లేదని దానిని మార్చాలని కనీసం ఆ ట్యాగ్‌లైన్‌ను అయినా తీసేయండి అంటూ అభిమానులు అడుగుతున్నారట. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అనేది ఏదో బస్సుల వెనకాల, ఆటోల వెనకాల రాసిన స్లోగన్‌లా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట.

ఈ విషయం చివరకు రామ్ చరణ్ వరకు చేరిందట. ఆయన మాత్రం ఆ ట్యాగ్‌లైన్‌ తీసేయడానికి ఇష్టపడడం లేదట. టైటిల్‌ మార్చేది లేదని, ట్యాగ్‌లైన్‌ కూడా అదే ఉంటుందని తేల్చిచెప్పారట.