ఫ్రాన్స్ కి పాకిన నాగచైతన్య ప్రేమమ్!

సినిమాకి ఎల్లలు లేవంటారు.భావానికి బాషాక్కర్లేదని కూడా విన్నాం.సినిమాలో కంటెంట్ ఉంటే అది బాషా బేధం లేకుండా దేశ సరిహద్దులు చెరిపేసిన చిత్రాలు చరిత్రలో ఎన్నో వున్నాయి.ఈ కోవలోకే తాజాగా నాగచైతన్య నటిస్తున్న మలయాళం మూవీ ప్రేమమ్ కూడా చేరుతోంది.

ఈ లో బడ్జెట్ మూవీ కోట్లు కురిపిస్తోంది.అందరి దృష్టిని ఆకట్టుకున్న మలయాళీ క్లాసిక్ ప్రేమమ్ బాషా బేధం లేకుండా ఇండియా లో అన్ని భాషల్లోనూ విజయడంకా మోగిస్తోంది.ఓ సింపుల్ కాన్సెప్ట్ కి అందమైన చిత్ర రూపం ఇస్తే మనకు కనిపించేదే ప్రేమమ్ సినిమా.ఓ వ్యక్తి.. తన జీవితంలో మూడు స్టేజ్‌ల్లో ఎదుర్కొన్న ప్రేమ భావనల తెరరూపమే ‘ప్రేమమ్’

తెలుగులో నాగచైతన్య ఎంతో ఇష్టపడి ఈ రీమేక్ లో నటిస్తున్నాడు.తమిళ్ లో రజిని అల్లుడు ధనుష్ కూడా ఈ సినిమాపై కన్నేసినా అప్పటికే చాలామంది తమిళ్ ప్రేక్షకులు ఈ సినిమాని మలయాళం లో చూసేయడం వల్ల వెనక్కి తగ్గాడు.అయితే తాజాగా ఓ ఫ్రెంచ్ డిస్ర్టిబ్యూటర్ ఈ సినిమా చూసి ఫ్లాట్ అయ్యాడంట.ఇలాంటి సినిమాకి ఫ్రెంచ్ ప్రజలు కూడా బ్రహ్మరథం పడతారని డబ్బింగ్ రైట్స్ కూడా కొనుగోలు చేసాడని వినికిడి.ఇప్పటికే బాషా బేధం లేకుండా ఇండియా లో అందర్నీ అలరిస్తున్న ఈ మలయాళీ చిత్రం ఫ్రెంచ్ ప్రజలను అలరిస్తే అది మాలీవుడ్ కి శుభవార్తే.