బన్నీ పార్టీ మాస్..ఊర మాస్..

అల్లు అర్జున్ నటించిన సరైనోడు 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఇంతవరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సభ్యులందరికీ అల్లు అర్జున్ మాంచి పార్టీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఓ సందర్భంలో స్టైలిష్ స్టార్ నోటి వెంట వచ్చినమాట..మాస్ ఊర మాస్. అదే డైలాగ్ ను పార్టీకి క్యాప్షన్ గా పెట్టేశాడు అర్జున్. పేరు తగ్గట్టుగానే పార్టీలో అరేంజ్ మెంట్స్ ను అదరగొట్టేశారట. రెండు రోజుల క్రితం జరిగిన ఈ పార్టీ అంతా ఆశ్చర్యపోయేలా అత్యంత గ్రాండ్ గా సాగినట్లు సమాచారం.

ఏర్పాట్ల నుంచి పార్టీకి వచ్చిన అతిథులను పలకరించే పని మొత్తం బన్నీయే చూసుకున్నాడట. వేడుకకు హాజరైన వారందరితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పాడట. పార్టీ పూర్తయ్యేసరికి తెల్లారుజాము అయిందని.. అంతవరకూ అర్జున్ అక్కడే ఉన్నాడని సమాచారం. వియోత్సవ వేడుక చేపట్టింది తనే కాబట్టి.. ప్రతీ విషయాన్నీ బన్నీ జాగ్రత్తగా చూసుకున్నాడని… లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తపడ్డాడని అంటున్నారు.