బాబు ప్లీజ్: సింధు కూడా నా

అందరిలా మాట్లాడితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.ప్రపంచానికి పాఠాలు చెప్పింది ఆయనే..సెల్ ఫోన్ ని ఇండియాకి తెప్పించింది ఆయనే..సాఫ్ట్ వేర్ ని కనిపెట్టింది ఆయనే..వినే ఓపిక ఉంటే ఇలాంటివి ఇంకా చాలా లిస్ట్ వుంది కానీ ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.అంతటి ఘనాపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.

సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నియమితులయితే దానిక్కూడా బాబే కారణమని ఆ మధ్య నవ్వులపాలయ్యాడు.అమరావతికి ఒలింపిక్స్ తెస్తానని ఇంకోసారి అభాసుపాలయ్యాడు.ఇలా సీజనల్ గా ట్రెండ్ ని బట్టి ప్రపంచం నలుమూలలా ఏది జరుగుతున్నా అందులో తన గొప్పతనాన్ని ఇరికించే ప్రయత్నం మాత్రం బాబు గారు చేస్తూనే వున్నారు.

తాజాగా యావతా భారత దేశం గర్విస్తున్నా తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు వెనుకా చంద్రబాబే ఉన్నాడట.బాబోయ్ ఈ ఘోరం మేము వినలేము..ఇలాగే వింటూ పోతే చంద్రబాబు కామెడీ ఏ రేంజ్ కి వెళ్తుందో వూహిండం కష్టం సుమీ.అదేంటో కానీ ప్రతి గొప్పోళ్ళ వెనుకా చంద్రబాబే ఉంటుంటాడు ఎప్పుడు ఎవరికీ అంతుపట్టని రహస్యంలా వుంది ఈ వింత.