రెమో TJ రివ్యూ

సినిమా : రెమో
రేటింగ్ : 3 /5
పంచ్ లైన్ : రాజుగారి రెమో రీజనబుల్
బ్యానర్: 24 ఏఎం స్టూడియోస్
తారాగణం: శివ కార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య, సతీష్, కె.ఎస్. రవికుమార్, యోగిబాబు, రాజేంద్రన్ తదితరులు
సంగీతం: అనిరుధ్
కూర్పు: రూబెన్
ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
నిర్మాత: ఆర్.డి. రాజా
రచన, దర్శకత్వం: భాగ్యరాజ్ కణ్ణన్

వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న హీరో శివ కార్తికేయన్ ఆడ మగ రెండు వేషాల్లో అద్భుతంగా నటించి తమిళనాట ఘన విజయాన్ని సాధించిన రెమో సినిమాని అదే పేరుతో తెలుగులో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనువదించి రిలీజ్ చేయడం తో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.దానికి తోడు దిల్ రాజు సినిమా ప్రమోషన్ కూడా ఓపెనింగ్స్ రాబట్టడం లో కొంత వరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు.

తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడనగానే మినిమం గారెంటీ సినిమా అని సగటు ప్రేక్షకుడు సినిమాకి వెళ్తాడు.ఆ మినిమం గురెంటీకి ఎటువంటి ఢోకా లేకుండా ఉందీ రెమో.రెగ్యులర్ తమిళ వాసన ఉన్నప్పటికీ మోతాదులుకు మించి లేకుండా ఉండడం,పి సి శ్రీరామ్ కెమెరా పనితనం,శివ కార్తికేయ నటన డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న భావన ఎక్కడా కలగవు.

చాలా తమిళ్ సినిమాల్లో హీరో రక రకాల వేషాల్లో కనిపించడం చూసి చూసి వెగటుపుట్టేసిన రోజులివి.మళ్ళీ ఈ రెమో లో కూడా హీరో ఆడ వేషాల్లో కనిపించడంతో మళ్ళీ కథకు అవసరం లేని అర్థం పర్థం లేని వేషాలనుకుంటే పొరపాటే.ఈ కథే ఆడ వేషం మీద బేస్ చేసుకుని నడుస్తుంది.కథ పరంగా హీరో మగ పాత్ర కంటే ఆడ పాత్రకే ప్రాధాన్యం ఎక్కువ,పాత్ర నిడివి కూడా ఎక్కువే.

శివ కార్తికేయ నటుడిగా ఈ సినిమాతో ఇంకో మెట్టేక్కేసాడు.ఆడ వేషంలో అతని బాడీ లాంగ్వేజ్ ,హావ బావాలు సింపుల్ గా సూపర్బ్ అని చెప్పాలి.ఇక రెగ్యులర్ లవర్ బాయ్ గా అతని ఎనర్జీ,డాన్స్ లు,లవ్ సీన్స్ అన్ని అద్భుతంగా వున్నాయి.ఆన్ స్క్రీన్ శివ కార్తికేయ,కీర్తి సురేష్ ల కెమిస్ట్రీ సూపర్బ్.

హీరోగా ప్రయత్నాలు చేస్తూ,రక రకాల వేషాల్లో దర్శకుల్ని కలుస్తుండే ఓ కుర్రాడు,తొలి చూపులోనే ప్రేమలో పడిన అమ్మాయి ప్రేమని పొందడానికి అనుకోని పరిస్థితుల్లో ఆడ వేషంలో అమ్మయికి పరిచయమై ,ఆ ప్రేమను పొందటానికి అదే వేషాన్ని కొనసాగిస్తూ చివరికి తన ప్రేమను ఎలా పొందాడు అన్నదే కథాంశం.కథకు అవసరం లేని వేశాల్ని హీరోకి అతికించకుండా కథానుసారం హీరో వేషాలు మార్చడం మెచ్చుకోదగింది.కథకి హీరో తో పాటు హెరాయిన్ కీర్తి సురేష్ అందం అభినం పెద్ద బోనస్ అనే చెప్పాలి.అప్పుడెప్పుడో వచ్చిన వెంకటేష్ శ్రీను సినిమా షేడ్స్ మనకు గుర్తొచ్చినా దర్శకుడు సినిమాని ఎమోషనల్ గా కాకుండా ఎనేర్జిటిక్ గా నడిపించి మెప్పించాడు.

సాంకేతికంగా చాలా హై స్టాండర్డ్స్ తో తీసిన సినిమా ఇది.సినిమా చూస్తున్నంత సేపు ఆ అనుభూతి ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.ఇండియన్ స్క్రీన్ పై తాను టాప్ కెమెరామెన్స్ లో ఒకడ్ని ఎందుకో పి సి శ్రీరామ్ మరో సారి ఈ సినిమాతో చూపించాడు.బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.పాటలు పర్లేదు.మాటలు అక్కడక్కడా ఓవర్ అనిపించినా పర్లేదు.

ఓవర్ అల్ గా దిల్ రాజు డబ్ చేస్తున్నాడంటే వుండే మినిమం క్వాలిటీస్ ఉన్న సినిమా ఈ రెమో.దాంతో పాటు రెగ్యులర్ తమిళ సినిమానే అయినా సినిమాలో ఫ్రెషన్స్ కనిపిస్తుంది.సినిమా రన్ టైం కూడా తక్కువగా ఉండటం ,సినిమా ఆద్యంతం పి సి శ్రీరామ్ కలర్ ఫుల్ కెమెరా పనితనం తో సినిమా ఆహ్లాదంగా నడిచిపోతుంది.