150 రూపాయిలకు రేప్ వీడియో!

ఉత్తరప్రదేశ్ లో అత్యాచార ఘటనలకు సంబంధించిన వీడియోలు మార్కెట్లో కి సైతం వచ్చేశాయి. హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఒక్కొక్కటీ యాభై రూపాయల నుంచి 150 రూపాయల దాకా అమ్ముతున్నారు. అది ఓ సీడీ రూపంలో ఉండదు. కావాల్సిన వారు ఆ షాపులకు వెళితే స్మార్ట్ ఫోన్లలోనో లేక పెన్ డ్రైవ్ లోనో వేస్తారు. నిడివి బట్టి, స్పష్టత బట్టి రేటు. ‘ఇవి రియల్ లైఫ్ క్రైమ్ ఘటనలు..

వీటిలో మజా ఉంటుందని ఎక్కువ మంది యువకులు భావిస్తున్నారు. కొంతమంది ఇవి డౌన్ లోడ్ చేసుకున్నాక తమ ఫ్రెండ్స్ కు షేర్ చేస్తున్నారు’ అని ఆగ్రా కు చెందిన ఓ డీలర్ చెబుతున్నాడు. బిజినెస్ లో ఉచ్చనీచాలు ఉండవనడానికి ఇదో ఉదాహరణ. అత్యాచారాన్ని వీడియో తీయడం ఎక్కువయిపోయిందని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడానికో లేక మరింతగా లొంగదీసుకుని అట్టేపెట్టుకోడానికో రేపిస్టులు ఈ వీడియోను వాడుకుంటున్నారని వారు చెబుతున్నారు