రేష్మి కోరింది ఇస్తామంటూ క్యూ!

‘అంతం’ సినిమాకి రష్మి గ్లామరే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌. ఈ సినిమా పోస్టర్లలో రష్మి ఫొటోనే ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించింది. అయితే సినిమాలో రష్మి పాత్ర మరీ అంత ఎక్కువేమీ కాదు. కానీ రష్మి చుట్టూనే ప్రమోషన్‌ జరిగింది. ఇది చాలు రష్మి చిన్న సినిమాలకు ఏ స్థాయిలో ప్లస్‌ అవుతుందో చెప్పడానికి. వెండితెర నుంచి బుల్లి తెరకి, బుల్లి తెర నుంచి వెండి తెరకు సాగిన, సాగుతున్న రష్మి ప్రయాణం ఇప్పుడు సూపర్‌ స్పీడ్‌తో దూసుకెళుతోంది.

ఓ వైపు జబర్‌దస్త్‌ కామెడీ షోలో దుమ్ము రేపుతూనే ఇంకో వైపున సినిమాల్లో హల్‌చల్‌ చేస్తోంది ఈ బ్యూటీ. రష్మితోపాటే అనసూయ కూడా సినిమా కెరీర్‌ ప్రారంభించినా, అనసూయ ఒకటి రెండు సినిమాలతోనే చతికిలపడింది. పేరొచ్చినా, అనసూయ కెరీర్‌లో వేగం కనిపించడంలేదు. రష్మి అలా కాదు, అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటోంది. తెలుగు తెరకు నయా గ్లామర్‌ని పంచుతోంది. రష్మితో మినిమమ్‌ బడ్జెట్‌లో సినిమా చేసేస్తే, సినిమా ఎలా ఉన్నా లాభాల పంట పండుతుందని టాలీవుడ్‌లో చిన్న చిన్న నిర్మాతలు అనుకుంటున్నారట.

‘గుంటూరు టాకీస్‌’, ‘అంతం’ చిత్రాలో సోసోగా ఉన్నా, అందులో రష్మి గ్లామర్‌ ఆ సినిమాలకి వసూళ్ళ పంటను పండించింది. ఇంకా రష్మి చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అవన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. తక్కువ రోజుల్లోనే సినిమా షూటింగ్స్‌ పూర్తి చేసేసుకునేలా రష్మి అందిస్తున్న సహకారంతో, ఆమె కోరిన రెమ్యునరేషన్‌ ఇవ్వడం కూడా నిర్మాతలకు కష్టంగా ఉండడంలేదట. ఏదేమైనా అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్న రష్మి గ్రేటే కదా.