షర్మిల c / o కేరళ

ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 ఏళ్ళ పాటు ఓ ఆశయం కోసం నిరాహార దీక్ష చేసి ఉద్యమిస్తే ఆమెకి ప్రత్యక్ష ఎన్నికల్లో పడ్డ ఓట్లు 90 .అదే ఓ ప్రజా ప్రతినిధి, మంత్రి అయిన వ్యక్తి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో పోటీ చేస్తే 50 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి.ఇదీ మన ప్రజాస్వామయం.ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వాంగా చెప్పుకునే మనదేశం లో రాజకీయనాయకులే కాదు సామాన్య ప్రజలూ శృతిమించిపోయారు,మంచి చెడుల మధ్య తేడా లేకుండా విచక్షణ కోల్పోయారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదేమో.

ఈపాటికే అర్థం అయ్యుంటుంది ఆ మహిళే మణిపూర్ లో సైనిక దళాల ప్రత్యేక అధికారాలు తొలగించాలని 16 ఏళ్ళ పాటు పోరాడిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల.ఇక ఆప్రభుద్దుడు ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ మంత్రివరంలో పనిచేసిన ప్రజాపతి.దీక్షను విరమించి ప్రత్యక్ష రాజకేల్లోకి వచ్చి మణిపూర్‌లోని తౌబల్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఇబోబి‌సింగ్‌పై పోటీ చేసిన ఇరోమ్ షర్మిలకు కేవలం 90 ఓట్లే పొలవడం తో షర్మిల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

తాజాగా షర్మిల మానసిక ప్రశాంతత కోసం కేరళ పర్యటనకు వచ్చారు.మంగళవారం 45 వ పుట్టిన రోజు జరుపుకున్న షర్మిల మానసిక ప్రశాంతత కోసం కేరళ లోని గిరిజన

ప్రాంతమైన పలక్కాడ్ జిల్లాలోని అట్టపాడి ప్రాంతంలో గడపనున్నారు.ప్రముఖ దాత ఉమాప్రేమన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతి ఆశ్రమంలో సేద తీరనున్నారు.కొసమెరుపు ఏంటంటే  “సైనిక దళాల ప్రత్యేక అధికారాలు ఎత్తేవేసే  వరకు తాను పోరాడుతూనే ఉంటానని చెప్పడం”